బెదిరింపు ఫోన్ కాల్స్ పై మోహన్‌బాబు ఫిర్యాదు
హైదరాబాద్: సీనియర్ నటుడు మోహన్ బాబు గతవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తను వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెల 22న రాత్రి వేళ దాదాపు 30కి పైగా ఫోన్‌కాల్స్ వచ్చినట్లు మోహన్‌బాబు మార్చి 26న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, సియోటెల్ ప్రాంతాల నుంచి […]
హైదరాబాద్: సీనియర్ నటుడు మోహన్ బాబు గతవారం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తను వైసీపీ పార్టీలో చేరిన దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెల 22న రాత్రి వేళ దాదాపు 30కి పైగా ఫోన్‌కాల్స్ వచ్చినట్లు మోహన్‌బాబు మార్చి 26న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, సియోటెల్ ప్రాంతాల నుంచి 22వ తేదీన అర్ధరాత్రి వేళ ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ మోహన్‌బాబు కోరినట్లు బంజారా హిల్స్ ఇనస్పెక్టర్ తెలియజేశారు.