MMTS Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఆ రోజు MMTS రైళ్లు రద్దు..!

MMTS Trains Cancelled: ఇటీవల నుంచి హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు అవుతున్నాయి. రద్దీ లేని మార్గాల్లో రైళ్ల సర్వీసులను తగ్గిస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో..

MMTS Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఆ రోజు MMTS రైళ్లు రద్దు..!
MMTS Trains
Follow us
Subhash Goud

|

Updated on: Jul 08, 2022 | 5:38 PM

MMTS Trains Cancelled: ఇటీవల నుంచి హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు అవుతున్నాయి. రద్దీ లేని మార్గాల్లో రైళ్ల సర్వీసులను తగ్గిస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో మరోసారి ఎంఎంటీస్‌ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. ఆదివారం (జూలై 10) పలు లోకల్‌ ట్రైన్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి- హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, హైదరాబాద్- లింగంపల్లి మార్గంలో 9 ఎంఎంటీఎస్‌ సర్వీసులు, ఫలక్ నూమా- లింగంపల్లి మార్గంలో 7 రైళ్లు, లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులు, అలాగే సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అలాగే రైలు నెంబర్‌ 07594 కాచిగూడ – నిజామాబాద్‌ రైలును జూలై 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిజామాబాద్‌-కాచిగూడ మధ్య నడిచే రైలు (07595)ను జూలై 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఇక నిజామాబాద్‌-నాందేడ్‌ మార్గంలో నడిచే రైలు (07853)ని జూలై 21వ తేదీని పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది. నాందేడ్‌-నిజామాబాద్‌ మార్గంలో గల రైలు (07854) రైలును 21వ తేదీ నుంచి పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు.

అలాగే రైలు నం. 17254 కాచిగూడ – గుంటూరు DEMU ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసింది. జూలై 8న కర్నూలు సిటీ- గుంటూరు మధ్య నడిచే రైలును పాక్షికంగా రద్దు చేయబడింది.

ఇవి కూడా చదవండి

Mmts

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి