AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radiative Cooling System: ఎలాంటి విద్యుత్‌ అవసరం లేకుండానే ఏసీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల ఘనత

Radiative Cooling System: ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఏసీలను వాడుతుంటారు. కానీ ఏసీలను వాడటం అనేది చాలా ఖరీదైనది. సామాన్యుడు..

Radiative Cooling System: ఎలాంటి విద్యుత్‌ అవసరం లేకుండానే ఏసీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల ఘనత
Radiative Cooling System
Subhash Goud
|

Updated on: Jul 05, 2022 | 5:31 PM

Share

Radiative Cooling System: ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఏసీలను వాడుతుంటారు. కానీ ఏసీలను వాడటం అనేది చాలా ఖరీదైనది. సామాన్యుడు ఏసీ వాడాలంటే కుదరని పని. ఎందుకంటే ఏసీనీ అధిక ధరకు కొనుగోలు చేయడమే కాకుండా విద్యుత్‌ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంటుంది. విద్యుత్‌ బిల్లును చూసే సామాన్యుడు ఏసీలకు దూరంగా ఉంటాడు. ఇక గువాహటిలోని ఐఐటీ శాస్త్రవేత్తలు చక్కటి మార్గాన్ని కనిపెట్టారు. వీరి పరిశోధన కారణంగా విద్యుత్‌ అవసరం లేకుండా ఉంటుంది. చౌకైన రేడియేటివ్‌ కూలర్‌ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటిపైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా చల్లధనం అందిస్తుందని వారు చెబుతున్నారు.

ఇలాంటి విధానాలను ‘పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌’ అని పేర్కొంటారు. ఇవి సమీప ప్రాంతాల నుంచి వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఇది భూ వాతావరణం గుండా ప్రయాణించి చల్లగా ఉండే అంతరిక్షంలోకి చేరుతుంది. అయితే పాసివ్‌ రేడియేటివ్‌ కూలర్లు రాత్రి సమయాల్లో మాత్రమే పని చేస్తాయి. పగటి వేళల్లోనూ ఉపయోగాపడాలంటే ఈ కూలర్లు సౌర రేడియోధార్మికత మొత్తాన్ని పరావర్తనం చెందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన ఇలాంటి వ్యవస్థలు పగటి సమయాల్లో సరైన చల్లధానాన్ని అందించలేకపోతున్నాయని గువాహటి ఐఐటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ టెక్నాలజీ రూపొందించేందుకు తాము సిలికాన్‌ డైఆక్సైడ్‌, అల్యుమినియం నైట్రైడ్‌లతో పలుచని పొరలను డెవలప్‌ చేశామని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇవి సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాలని చెబుతున్నారు.

ఇవి సౌర, వాతావరణ రేడియోధార్మికతను 97 శాతం పరావర్తనం చెందించాయని తెలిపారు. ఈ రేడియేటివ్‌ కూలర్‌ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు లోపలికన్నా 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. ఇలాంటి సాధానాలను అభివృద్ధి చేయడం చాలా కష్టమని, మేము రూపొందించిన టెక్నాలజీతో ఇది తప్పకుండా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో వేడిగా ఉండే ఇళ్లు, వాహనాల్లో ఉంటే సంప్రదాయ టెక్నాలజీకి ఇది ప్రత్యామ్నాయం. ఈ వ్యవస్థ పగటి వేళ కూడా సమర్థవంతంగా పని చేస్తుందని అన్నారు. ఈ టెక్నాలజీని కంప్యూటర్‌ ఆధారంగా పరీక్షించామని, సాధ్యమవుతుందని ఐఐటీ గువాహటి ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేబబ్రత సిక్దర్‌ వెల్లడించారు. పరిసరాలలోకి వ్యర్థ వేడిని డంప్‌ చేసే సంప్రదాయ శీతలీకరణ సాంకేతికతలకు భిన్నంగా, రేడియేటివ్‌ శీతలీకరణ అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. రేడియేటివ్‌ కూలింగ్‌ మిగులు వేడిని అత్యంత చల్లగా ఉండే అంతరిక్షంలోకి నేరుగా పంపడం ద్వారా భూమి మీద ఒక వస్తువును చల్లబరుస్తుందని అన్నారు. ఈ విధానం ద్వారా ఎలాంటి విద్యుత్‌ అవసరం లేకుండానే చల్లదనాన్ని పొందవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, గత రెండు సంవత్సరాల కిందట తేమ ఉండే గాలిలో నుంచి నీటిని తయారుచేసే సమర్థవంతమైన పద్ధతిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)X] గౌహతి పరిశోధకులు రూపొందించారు. కీటకాలు, మొక్కలు నీటిని పీల్చుకొనే విధానాన్ని ఆసరాగా చేసుకొని కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. నీటిని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయేతర పద్ధతులను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఐటీ గౌహతి సెంటర్ ఆఫ్ నానోటెక్నాలజీ అసోసియేటెడ్​ ప్రొఫెసర్​తెలిపారు.

నీటిని తయారు చేసేందుకు ప్రకృతిపైనే శాస్త్రవేత్తలు దృష్టిసారిస్తున్నారన్నారు. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో గాలిలో నుంచి నీటిని పీల్చుకొనేందుకు మొక్కలు, కీటకాలకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, దీన్ని అనుకరిస్తూ గాలి నుంచి నీటిని తయారు చేసేలా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి