School Bus: వరద నీటిలో చిక్కుకుపోయిన స్కూల్ బస్సు.. విద్యార్థులను రక్షించిన స్థానికులు
School Bus: ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చుక్కుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సు..
School Bus: ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చుక్కుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. భారీ వర్షాలకు జిల్లాలోని ఆచన్‌పల్లి-కోడూరు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో రామచంద్రపురం నుంచి సుగురు తండాకు వెళ్తున్న స్కూల్ వరదనీటిలో చిక్కుకుంది. ఈ నీటిలో బస్సు సగభాగం పూర్తిగా మునిగిపోవడంతో విద్యార్థులకు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
బస్సు ఒక్కసారిగా నీటిలో సగభాగం మునిగిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురై కేకలు, ఏడుపులతో దద్దరిల్లింది. విద్యార్థులను రక్షించిన తర్వాత ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు తీశారు. ఇలా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై స్కూల్ యాజమాన్యం, పోలీసులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బస్సులో దాదాపు 30 మంది విద్యార్థులు ఉండగా, వారందరిని సురక్షితంగా రక్షించారు స్థానికులు
డ్రైవర్ నిర్లక్ష్యమేనా..?
స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరదనీరు పారుతున్నా.. అలాగే బస్సును పోనివ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండటంతో వాగులు, కాలువలు నిండిపోయి భారీ వరద నీరు ప్రవహిస్తోంది.
#WATCH | Telangana: A school bus, carrying 30 students, was partially submerged in a flooded street in Mahbubnagar today. The students were rescued by the locals. The bus was later brought out of the spot. pic.twitter.com/7OOUm8as0v
— ANI (@ANI) July 8, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి