Hyderabad: నామినేషన్ల దాఖలు చివరి రోజు ఎంఐఎం ట్విస్ట్.. ఆ నియోజకవర్గంలో మారిన అభ్యర్థి
రాజేంద్రనగర్ నియోజకవర్గం లో టికెట్ కేటాయించిన అనంతరం అభ్యర్థి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే నామినేషన్ ఫైల్ చేయకపోవడంతో అలర్ట్ అయిన ఒవైసీ బ్రదర్స్ అతని ప్లేస్ లో మరో వ్యక్తికి బీఫామ్ ఇచ్చి నామినేషన్ ఫైల్ చేయించారు. గతంలో ఎంఐఎం కార్పొరేటర్‌గా పనిచేసిన రవి యాదవ్‌కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గం లో టికెట్ కేటాయించిన అనంతరం అభ్యర్థి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే నామినేషన్ ఫైల్ చేయకపోవడంతో అలర్ట్ అయిన ఒవైసీ బ్రదర్స్ అతని ప్లేస్ లో మరో వ్యక్తికి బీఫామ్ ఇచ్చి నామినేషన్ ఫైల్ చేయించారు. గతంలో ఎంఐఎం కార్పొరేటర్‌గా పనిచేసిన రవి యాదవ్‌కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. బహిరంగంగానే అసదుద్దీన్ ఒవైసీ రవి యాదవ్ పేరుని ప్రకటించిన పరిస్థితి. నామినేషన్ వేయకుండా కార్యకర్తలకి పార్టీ అధిష్టానానికి అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం కార్వాన్ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేస్తున్న స్వామి యాదవ్‌కి బీఫామ్ ఇచ్చి నామినేషన్ ఫైల్ చేయించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎంకి పట్టున్న 9 ప్రాంతాల నుంచి పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. చార్మినార్, యాకుత్‌పుర, బహదూర్‌పురలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన పరిస్థితి. ఈరోజుతో నామినేషన్ల హడావుడి పూర్తి అయిపోవడంతో ఇకనుంచి బహిరంగ సభలు పాదయాత్రలతో అభ్యర్థులు ప్రజలలోకి దూసుకుపోనున్నారు. గతంలో ఎంఐఎం నేతలు ప్రజల కోసం ఏం చేశారు రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనేది ప్రజలకు వివరిస్తున్నారు. పాతబస్తీ, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ కోసం అసదుద్దీన్ ఒవైసీ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ కౌన్సిలర్ గా పనిచేసి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులకే ఐదు చోట్ల టికెట్లు కేటాయించింది.
గతంలో రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నుంచి పార్టీ పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓటమి చెందింది. ఈసారి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ప్రధాన పోరు ఉండబోతుంది. రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం పోరు కొనసాగనుంది. కార్వాన్ లో బిజెపి వర్సెస్ ఎంఐఎం నాంపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం, మలక్‌పేట్ లో కూడా కాంగ్రెస్‌తో పోటీపడనుంది. ఎంఐఎంకు యాకూత్‌పురాలో ఎంబీటితో ప్రధాన పోరు ఉండబోతుంది. మలక్‌పేట్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎంఐఎంకి కాంగ్రెస్‌తో పోరు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి పార్టీకి గట్టి పోటీ ఇచ్చే యోచనలో ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో ఒవైసీ బ్రదర్స్ డే అండ్ నైట్ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బహిరంగ సభలకు శ్రీకారం చుడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..