AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: “పెద్దోళ్ల మీద పోటీ చేస్తే పెద్దోడిని అయితనని అనుకుంటున్నాడు”.. హుజూరాబాద్‌ రోడ్ షోలో కీలక వ్యాఖ్యలు

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి పాడి కౌశిక్ రెడ్డి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారు అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఒక్క పనైనా చేసిండా? అని ప్రశ్నించారు.

BRS Party: పెద్దోళ్ల మీద పోటీ చేస్తే పెద్దోడిని అయితనని అనుకుంటున్నాడు.. హుజూరాబాద్‌ రోడ్ షోలో కీలక వ్యాఖ్యలు
Harish Rao Election Campaign At Maanukota
Srikar T
|

Updated on: Nov 10, 2023 | 8:25 PM

Share

హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి పాడి కౌశిక్ రెడ్డి గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారు అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఒక్క పనైనా చేసిండా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి సానుభూతితో ఓట్లేయించుకున్నడని.. తర్వాత ఎవ్వరి ముఖం చూడలే అంటూ విమర్శించారు. హుజూరాబాద్‌లో ఏం చేయలేదు కానీ గజ్వేల్ వెళ్లి కేసీఆర్ మీద పోటీ చేస్తడంట అని చురకలు అంటించారు. పెద్దోళ్ల మీద పోటీ చేస్తే పెద్దోడిని అయితనని అనుకుంటున్నాడన్నారు.

బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ఆ పార్టీకి వేసి ఓటును వృధా చేయవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి, గజ్వేల్‌లో కేసీఆర్ గెలుస్తారు. ఈటల రెంటికి చెడ్డ రేవడి అయితడు ఆత్మగౌరవం పాట పాడిన ఈటల సమైక్యవాదులతో పొత్తు పెట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి క్రికెట్‌లో ఆల్‌రౌండర్.. రాజకీయాల్లో కూడా ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నాడు. సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరుండి అందించాడు అని వివరించారు. ప్రజల అభీష్టం మేరకు పాత సన్న బియ్యం సరఫరాతో పాటూ కోటి కుటుంబాలకు బీమా సౌకర్యం కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు గ్యారంటీ లేదన్నారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే ప్రతీ చిన్న పనికి ఢిల్లీ అనుమతి తీసుకోవాలని వ్యంగాస్త్రాలు సంధించారు. రైతుబంధు, రుణమాఫీ, దళిత బంధు పథకాలను ఈసీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఆపిందని చెప్పారు. రైతులను కాంగ్రెస్ అవమానిస్తుంటే.. కేసీఆర్ రైతు విలువ పెంచే ప్రయత్నం చేశాడని కీర్తించారు. బీఆర్ఎస్‌ని గెలిపించి హుజూరాబాద్‌ని అభివృద్ధి చేసుకుందాం అనే నినాదంతో ప్రసంగాన్ని ముగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ