కేసీఆర్ నియోజకవర్గం ఫస్ట్, రేవంత్ రెడ్డి నియోజకవర్గం లాస్ట్.. ఆసక్తికర సంఘటన
తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడు ఆ ఇద్దరి చుట్టే తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. తీరా నామినేషన్ల వ్యవహారంలో కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. నామినేషన్ల విషయంలో అటు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్, మరోవైపు రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండగల్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి...
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎలక్షన్స్ దగ్గర పడుతోన్న క్రమంలో పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక నామినేషన్ల పర్వం శనివారంతో పూర్తయింది. చివరి క్షణం వరకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో ఎన్నికలు ఇప్పుడు ఆ ఇద్దరి చుట్టే తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈ అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. తీరా నామినేషన్ల వ్యవహారంలో కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. నామినేషన్ల విషయంలో అటు సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్, మరోవైపు రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొండగల్ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ విషయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
రాష్ట్రంలో నామినేషన్ల సమయం గడిచిపోయింది. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బరిలో నిలవనున్నాడనే దానిపై క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3500 వరకు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. వీటిలో 96 నామినేషన్లతో గజ్వెల్ మొదటి స్థానంలో నిలవగా, కొడంగల్ 12 నామినేషన్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పుడీ అంశం ఆసక్తికరంగా మారింది. ఇలా నామినేషన్ల వ్యవహారంలో కూడా మళ్లీ ఆ ఇద్దరి ఆగ్రనేతల నియోజకవర్గాలే ఆసక్తిగా మారాయి.
గజ్వెల్‌లో ఉన్న భూనిర్వాసితులు, రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న చిన్నాచితకా పార్టీలు, భారీ సంఖ్యలో ఇండిపెండెంట్‌లు నామినేషన్లు వేశారు. సీఎం కేసీఆర్‌తో పోటీపడ్డాం అని చెప్పుకోవడానికి సగానికి పైగా అక్కడ నామినేషన్లు వేశారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని 96 నామినేషన్లు అక్కడ దాఖలు అయ్యాయి. ఒకవేళ చివరి వరకు ఎవరూ నామినేషన్లు విత్ డ్రా చేసుకోకపోతే.. 5 ఈవీఎమ్ మిషన్లు అవసరపడతాయి.
ఇక కొడంగల్ విషయానికొస్తే మొదటి నుంచి కొంత వెనుకబడి ఉన్న ప్రాంతం… తెలంగాణ సరిహద్దులు, కర్ణాటకకు ఆనుకుని ఉన్న నియోజకవర్గం.. దీంతో కామన్ గానే రాజకీయ చైతన్యం తక్కువగా ఉంటుంది. 2018 లో కూడా ఇక్కడ పదిలోపే నామినేషన్లు దాఖలు అయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..