పోలీస్ స్టేషన్‌పై రౌడీ మూకల దాడి..
హైదరాబాద్‌లో అర్థరాత్రి రౌడీషీటర్ల అనుచరులు రెచ్చిపోయారు. ఓల్డ్ సిటీలోని హబీబ్ నగర్ పీఎస్‌పై దాడి చేశారు. పీఎస్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన 30 మంది పీఎస్‌లోని ఫర్నీచర్, పూల కుండీలను ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు. అయితే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండ్రోజుల క్రితం ఖలీమ్, మరో రౌడీషీటర్లు అరెస్ట్ చేశారు. వారిని హబీబ్ పేట పీఎస్‌కు తరలించారు. రెండ్రోజులగా విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, స్థానిక యువతీ, యువకులు శుక్రవారం అర్థరాత్రి హబీబ్‌నగర్ పీఎస్‌పై దాడికి […]
హైదరాబాద్‌లో అర్థరాత్రి రౌడీషీటర్ల అనుచరులు రెచ్చిపోయారు. ఓల్డ్ సిటీలోని హబీబ్ నగర్ పీఎస్‌పై దాడి చేశారు. పీఎస్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన 30 మంది పీఎస్‌లోని ఫర్నీచర్, పూల కుండీలను ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారు. అయితే.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెండ్రోజుల క్రితం ఖలీమ్, మరో రౌడీషీటర్లు అరెస్ట్ చేశారు. వారిని హబీబ్ పేట పీఎస్‌కు తరలించారు. రెండ్రోజులగా విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, స్థానిక యువతీ, యువకులు శుక్రవారం అర్థరాత్రి హబీబ్‌నగర్ పీఎస్‌పై దాడికి దిగారు.
30 మంది వ్యక్తులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌లోకి దూసుకొచ్చి నానా హంగామా సృష్టించారు. పోలీసులనే బెదిరిస్తూ ఫర్నీచర్, ఇతర పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో.. అక్కడ ఉద్రిక్తత నెలకొంది.