Hyderabad: చిన్నారుల్లో ప్రతిభను చాటేలా.. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆటల పోటీలు
ఇందులో భాగంగా 30 మీటర్ డ్యాష్, బాస్కెట్‌బాల్ షాట్స్, ఇంటెన్స్ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లు, బ్యాడ్మింట్ వంటి ఆటల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లోనే ప్రతిభను ప్రపంచాన్ని చాటేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడిందని స్కూల్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఎంతో సహకారం అందిందని...
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని తట్టిలేపుతూ, వారిలోని ప్రతిభను చాటిచెప్పే ఉద్దేశంలో హైదరాబాద్‌లోని మెరూ ఇంటర్నేషన్ స్కూల్ మేరు విజేత ఇంటర్ కమ్యూనిటీ క్రీడా పోటీలను నిర్వహించారు. 40కి పైగా కమ్యూనిటీలకు చెందిన సుమారు 800కిపైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 30 మీటర్ డ్యాష్, బాస్కెట్‌బాల్ షాట్స్, ఇంటెన్స్ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లు, బ్యాడ్మింట్ వంటి ఆటల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లోనే ప్రతిభను ప్రపంచాన్ని చాటేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడిందని స్కూల్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఎంతో సహకారం అందిందని నిర్వాహకుల చెప్పుకొచ్చారు. అకాడమీతో పాటు ఇలాంటి క్రీడలకు పెద్దపీట వేస్తూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ కార్యక్రమాలు చేపడుతోంది. కేవలం విద్యకు మాత్రమే కాకుండా శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ పోటీలకు బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రెఫరీలు హాజరయ్యారు. అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చారు. దీంతో మరింత క్రీడా స్ఫూర్తిని చాటినట్లైంది. వారి నైపుణ్యం, నిష్పక్షపాత తీర్పు కారణంగా క్రీడలు మరింత ప్రొఫెషనలిజంగా మారాయి. మేరు విజేత ఇంటర్ కమ్యూనిటీ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజయవంతం కావడం, మేరు స్కూల్ యాజమాన్యం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యనతకు నిదర్శనమని పాఠశాల వర్గాలు తెలిపాయి.
ఇక మేరు ఇంటర్నేషనల్ స్కూల్ విషయానికొస్తే అత్యాధునిక నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులకు మంచి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. హైదరాబాద్‌లోని మియాపూర్‌తోపాటు తెల్లపూర్‌లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కేంబడ్రిడ్జి, సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యను బోధిస్తున్నారు. మంచి నాణ్యమైన విద్యను అందించడంలో మేరు స్కూల్స్ ముందు వరుసలో ఉంటున్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..