Hyderabad: డీఏవీ స్కూల్‌ ఘటనపై స్పందించిన చిరంజీవి.. ఈ ఘటన తనను కలచివేసిందంటూ ఎమోషనల్

హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు.

Hyderabad: డీఏవీ స్కూల్‌ ఘటనపై స్పందించిన చిరంజీవి.. ఈ ఘటన తనను కలచివేసిందంటూ ఎమోషనల్
Hero Chiranjeevi
Follow us

|

Updated on: Oct 25, 2022 | 8:31 PM

డీఏవీ స్కూల్‌ ఘటనపై ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి ప్రజా సంఘాలు. పసి మొగ్గపై పైశాచికం ప్రదర్శించిన నికృష్టిడిని ఉరి తీయాలని డిమాండ్ చేైస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై స్పందించారు మెగాస్టార్‌ చిరంజీవి. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్‌లో జరిగిన అత్యాచార ఘటన తనను బాగా కలచివేసిందని ట్వీట్‌ చేశారు. కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు శిక్షలు వేగవంతంగా విధించాలన్నారు. అంతేకాదు ఇటు విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. భావితరాలకు భరోసా కల్పించడం అందరి సమిష్ఠి బాధ్యత అన్నారు మెగాస్టార్.

బంజారాహిల్స్ DAV స్కూల్‌ పిల్లల భవిష్యత్‌ ఏంటి.. సెలవులు ఇంకెన్నాళ్లు కంటిన్యూ చేయాలి..! ప్రభుత్వ ఆప్షన్లు సమ్మతం కాదని పేరెంట్స్ అంటుంటే.. రద్దుపై వెనక్కి తగ్గేదే లేదని ప్రభుత్వం చెప్తోంది.. కఠిన చర్యలు తీసుకోకపోతే మిగతా స్కూల్స్‌ రూల్స్‌ కూడా పాటించవని చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌ డీఈవోతో స్కూల్‌ డైరెక్టర్స్‌ భేటీ కానున్నారు. పాఠశాల గుర్తింపు రద్దు వెనక్కి తీసుకోవాలంటూ పేరెంట్స్‌ ఇచ్చిన వినతి పత్రాలను ఇవ్వనున్నారు. మరోవైపు DAV స్కూల్‌ ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదో తరగతి వరకు స్కూల్‌కి పర్మిషన్‌ తీసుకుని..7 వ తరగతి వరకు యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ నిర్వహణలోనూ రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు సమాచారం. వీటిపైనా ఇప్పుడు విద్యాశాఖ అధికారులు సీరియస్‌ అవుతున్నారు. పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై మంత్రి సబితతో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ భేటీ కానుంది. విద్యా శాఖ సెక్రటరీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలన్నింటిపై దృష్టి పెట్టి రిపోర్ట్‌ ఇవ్వనుంది.

700 మంది విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారడం పట్ల విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారంతా మంత్రి సబితను కలిసి మాట్లాడారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో