Hyderabad: మానవబాంబునంటూ బ్యాంకులోకి చొరపడ్డ ఆగంతకుడు.. కట్ చేస్తే
సినిమాలోని కామెడీ సీన్‌కు ఏ మాత్రం తక్కువ కాదు ఈ ఘటన. ఇతడి వాటం.. వాలకం చూశారా..? సినిమాలో మాదిరి ఓ ఫేక్ డమ్మీ బాంబ్ సెటప్ ఒకటి ఒంటికి తగిలించుకుని బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత....
హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ బ్యాంక్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. బ్యాంకులోకి చొరబడి తాను మానవ బాంబునంటూ బెదిరింపులకు దిగాడు. అందుకు తగ్గట్లుగానే తన ఒంటికి ఓ బాంబ్ సెటప్ పెట్టుకుని వచ్చాడు. రెండు లక్షలు ఇవ్వకపోతే పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బ్యాంకులోని సిబ్బంది తొలుత ఆందోళన చెందారు. అయితే రాజా ది గ్రేట్ సినిమాలో రాజేంద్రప్రసాద్ పట్టుకొచ్చిన బొమ్మ గన్నుల్లాగానే.. అతడి బాంబు సెటప్ కూడా డొల్ల అని అక్కడున్నవారు కాసేపట్లోనే కనిపెట్టేశారు. వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు కాల్ చేశారు.
వెంటనే స్పాట్‌కు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు బాంబుతో బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శివాజీ అని గుర్తించారు. అతడు ఎందుకు అలా బిహేవ్ చేశాడు. మతిస్థిమితం లేక అక్కడికి వచ్చాడా..? లేదా నిజంగానే డబ్బు దోచుకెళ్లేందుకు కుట్ర పన్నాడా..? అతడిని ఎవరైనా అతని బ్రెయిన్ వాష్ చేసి.. ఈ తరహా పని చేసేందుకు పురిగొల్పారా అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.