AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్ కేసు.. వీడియోలు లీక్ చేసిన వ్యక్తి అరెస్టు.. వెలుగులోకి సంచలన విషయాలు

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరొకరిని అదుపులోకి...

Hyderabad: జూబ్లీహిల్స్ కేసు.. వీడియోలు లీక్ చేసిన వ్యక్తి అరెస్టు.. వెలుగులోకి సంచలన విషయాలు
Jubilee Hills
Ganesh Mudavath
|

Updated on: Jun 06, 2022 | 12:03 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేసిన పాతబస్తీకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించిన వీడియోలను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్నేషియా పబ్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్‌ కేసులో నిందితులందరూ రాజకీయ నేతల కుమారులుగా పోలీసులు గుర్తించారు. ఏ1 నుంచి ఏ6 వరకూ అందరూ వారే కావడం గమనార్హం. వీరందరూ ఒకే పార్టీకి చెందిన నేతల కుమారులు కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో A5 నిందితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని మైనర్ నిందితుడు స్టేట్మెంట్ రికార్డు చేశారు. మైనర్ ను జువైనల్ హోమ్ కు తరలించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్ వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్ లో ఆశ్రయం పొందారు.

శాస్త్రీయ ఆధారల కోసం ఫోరెన్సిక్ నిపుణులు జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ లో ఉన్న బెంజ్, ఇన్నోవా కార్లను పరిశీలించారు. కేసులో సీజ్ చేసిన బెంజ్ కారుని క్లూస్ టీం పరిశీలించింది. బెంజ్‌ కారులో బాధితురాలి చెప్పు, వెంట్రుకలు, చెవిరింగ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అత్యాచారం చేసిన ఇన్నోవా కారులో ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది క్లూస్ టీం. మరోవైపు గ్యాంగ్‌ రేప్ కేసు గంట గంటకు క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. ఎమ్మెల్యే రఘునందన్‌ రిలీజ్‌ చేసిన ఆధారాల్లో ఎమ్మెల్యే కుమారుడి వీడియోను పోలీసులు పరిశీలించారు.

జూబ్లీహిల్స్ లోని పబ్ లో నిర్వహించిన వేడుకలో విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో చాలా వరకు మైనర్లే ఉన్నారు. పార్టీ చేసుకుంటున్న సమయంలో బాధితురాలితో ఓ యువకుడు మాటలు కలిపాడు. తన స్నేహితులను పరిచయం చేశాడు. పార్టీ అయిపోయాక బాలికతో కలిసి బెంజి, ఇన్నోవా కార్లలో బయలుదేరారు. అదే సమయంలో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. తర్వాత బాలికను పబ్‌ వద్ద వదిలేసిన నిందితులు అదే బేకరీ వద్ద ఫొటోలు దిగారు. పార్టీ ముగిసిందంటూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎంతటి వారైనా వదలకూడదని డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి