AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థలు సూచించాయి.

Rain Alert: బలపడుతున్న అల్పపీడనం..! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2026 | 7:28 AM

Share

బంగాళాఖాతంలో ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మబ్బులు పడుతున్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవడం లేదు.. చిన్న చిన్న జల్లులు మాత్రమే పడుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓ మాదిరి వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేశాయి.. రెండు రోజుల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని అంచనా వేశాయి.. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేశాయి.. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై అల్పపీడనం మరింత బలపడి స్థిరంగా కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మేఘవృతమైన వాతావరణంతో పాటు, కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో వర్షాలు..

ఆదివారం (05-07-26) నాడు, అల్లూరి, పోలవరం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో కూడిన మేఘావృత వాతావరణం, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం, గాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా భారీ హోర్డింగ్‌ల దగ్గర నిలబడవద్దని ప్రజలకు సూచించారు.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ – దంచికొట్టనున్న వర్షాలు:

ఇదిలాఉంటే.. తెలంగాణలో రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయిని తెలిపింది. ఆదివారం, సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతోపాటు.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us