పెళ్లై ముగ్గురు పిల్లలున్నా.. యువతికి దగ్గరైన ఆటో డ్రైవర్.. చివరకు గర్భం దాల్చడంతో..
పెళ్లయింది.. పిల్లలున్నారు.. కానీ.. ఇదంతా దాచిపెట్టాడు.. కానిస్టేబుల్ అవుదామని శిక్షణ తీసుకుంటున్న యువతికి దగ్గరయ్యాడు.. ప్రేమిస్తున్నానన్నాడు.. ప్రాణమంటూ చెప్పాడు.. దీంతో అతని మాయమాటలకు ఆ యువతి కూడా నమ్మింది.. అలా.. దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శరీరకంగా అనుభవించాడు.. చివరకు గర్భం దాల్చింది.. తీరా పెళ్లి చేసుకోమని ఆ యువతి.. అడిగితే మొహం చాటేశాడు.

పెళ్లయింది.. పిల్లలున్నారు.. కానీ.. ఇదంతా దాచిపెట్టాడు.. కానిస్టేబుల్ అవుదామని శిక్షణ తీసుకుంటున్న యువతికి దగ్గరయ్యాడు.. ప్రేమిస్తున్నానన్నాడు.. ప్రాణమంటూ చెప్పాడు.. దీంతో అతని మాయమాటలకు ఆ యువతి కూడా నమ్మింది.. అలా.. దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శరీరకంగా అనుభవించాడు.. చివరకు గర్భం దాల్చింది.. తీరా పెళ్లి చేసుకోమని ఆ యువతి.. అడిగితే మొహం చాటేశాడు. గర్భవతినిచేసి పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతికి ఏం చేయాలో అర్ధం కాలేదు.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించి.. చివరకు ఆత్మహత్య చేసుకుంది.. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాచారంలో స్థానికంగా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న మహేందర్‌కు యువతి పరిచయం అయ్యింది. ఇంటర్ వరకు చదువుకున్న యువతి తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ గా పనిచేసే మహేందర్ తో యువతకి పరిచయం ఏర్పడింది.. తనకు పెళ్లి కాలేదని యువతిని నమ్మించి యువతికి దగ్గర అయ్యాడు. ఇదే క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతితో సన్నిహితంగా ఉంటూ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది.
ఇదే విషయాన్ని మహేందర్ కు ఫోన్ చేసి చెప్పగా.. తాను పెళ్లి చేసుకోను అని మొహం చాటేసాడు. దీంతో చేసేదేంలేక తన కుటుంబ సభ్యులకు యువతి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఇంట్లోనే తల్లిదండ్రులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అందరూ కలిసి.. నాచరం పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన యువతి.. గర్భవతి అయినా కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు మహేందర్‌ను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. మహేందర్ కు అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ విషయాన్ని యువతికి దాచి పెట్టి.. సన్నిహితంగా ఉంటూ ఆమెను వాడుకుని మోసం చేశాడని పోలీసులు తెలిపారు. మరోవైపు మహేందర్ పై పాత కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..