Hyderabad: సంఘీ టెంపుల్‌కు వచ్చిన ప్రేమ జంట.. దైవదర్శనం చేసుకుంటారేమో అనుకుంటే…
తొలుత స్నేహం.. ఆపై ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. తమ ఆలోచనను ఇంట్లో వాళ్లకు చెప్పారు. కానీ వారి నుంచి నో అనే సమాధానం వచ్చింది. అయినా కొంతకాలం వేచిచూశారు.

హైదరాబాద్, జులై 26: ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని అందమైన జీవితాన్ని కొనసాగించాలని కలలు కన్నారు. పెళ్లికి పెద్దలు తిరస్కరించడంతో ఆందోళన చెందారు… కలిసి బతకలేనప్పుడు కలసి చద్దామని నిర్ణయించుకున్నారు.. పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. గమనించిన స్థానికులు వెనువెంటనే ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సరూర్ నగర్‌కు చెందిన శ్రీధర్ రామంతపూర్‌కు చెందిన సుప్రియల మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని తమ ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పారు.. పెద్దలు వీరిద్దరి పెళ్లికి ససేమిరా అన్నారు. వారిని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. దీంతో కలిసి బతికే అవకాశం లేనప్పుడు.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు..
తమ ఆలోచనలో భాగంగా అబ్దుల్లా పూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘీ టెంపుల్ వద్దకు వచ్చారు. అనంతరం ఉమర్ఖాన్ గూడ సమీపంలోకి చేరుకున్నారు . వస్తూ వస్తూ తమతో పురుగుల మందును వెంట తెచ్చుకున్నారు. ఉమర్ఖాన్ సమీపంలో వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి ఆత్మహ్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరినీ గమనించిన స్థానికులు సపర్యలు చేశారు .అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రేమ జంటను స్థానికంగా ఉండే అబ్దుల్లాపూర్ మెట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ప్రేమ జంటకు చికిత్స కొనసాగుతోంది. ఇద్దరి ఆరోగ్య పరిస్తితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది… ప్రేమికుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.. ప్రేమజంట ఆత్మహత్య యత్నంపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
