Hyderabad: కుర్చీతాత అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

గుంటూరు కారం సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఓ ఊపు ఊపింది. ఆ సాంగ్‌లో కుర్చీ తాత పాపులర్ డైలాగ్‌ను వాడికున్నందుకు గానూ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకుని ఆర్ధిక సాయం అందించారు. వైజాగ్ సత్య సాయంతో తమన్‌ని కలిశాడు కుర్చీతాత.

Hyderabad: కుర్చీతాత అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
Kurchi Tata
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 24, 2024 | 7:42 PM

కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కుర్చీ తాత. అంతెందుకు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ అనే పదంతో సాంగ్‌ కూడా పెట్టారు. అది సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పదం వాడుకున్నందుకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేశారని సమాచారం. తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని ప్రచారం చేస్తున్నాడని..  అందుకే పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పాడు వైజాగ్ సత్య.

వాస్తవానికి వైజాగ్ సత్య సాయంతో తమన్‌ని కలిశాడు కుర్చీతాత. వైజాగ్ సత్య మంచివాడని.. అతని వల్ల మేలు జరిగిందని పలు ఇంటర్వ్యూలతో చెప్పిన కుర్చీ తాత.. ఇప్పుడు రివర్సవ్వడం గమనార్హం. వైజాగ్ సత్య.. తన పేరు ఉపయోగించుకుని డబ్బులు దండుకుంటున్నాడని ప్రచారం చేయడం.. చంపేస్తా, నరికేస్తా అంటూ వీడియోలు చేయడంతో.. ఆందోళన చెందిన వైజాగ్ సత్య  కుర్చీ తాతపై ఫిర్యాదు చేశాడు.

తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకుని వెళ్లాలని గొడవ చేస్తున్నాడట కుర్చీతాత. అది అసాధ్యం అని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లు చెబుతున్నాడు వైజాగ్ సత్య. 2 రోజులుగా కుర్చీతాత కోసం పోలీసులు వెతుకుతున్నారని.. చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేసినట్లు చెప్పాడు వైజాగ్ సత్య.

కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!