AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ ప్రగతికి నిదర్శనం: సీఎం కేసీఆర్

Telangana CM K Chandrashekar Rao: ప్రభుత్వం నిర్వహించిన వేలంలో హైదరాబాద్ భూములకు అత్యధిక ధర లభించింది. ఈ వేలంలో ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు.

Hyderabad: ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ ప్రగతికి నిదర్శనం: సీఎం కేసీఆర్
Hyderabad
Venkata Chari
|

Updated on: Aug 04, 2023 | 12:58 AM

Share

Telangana CM K Chandrashekar Rao: ప్రభుత్వం నిర్వహించిన వేలంలో హైదరాబాద్ భూములకు అత్యధిక ధర లభించింది. ఈ వేలంలో ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా.. ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని ఆయన అన్నారు.

హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్ ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్‌ను, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

ఆల్ టైం రికార్డు ధర..

ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. ఈ సందర్భంగా జరిగిన వేలంలో తెలంగాణ భూములకు కనీవినీ ఎరుగని ధర పలికింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియో పోలీస్ ఫేస్ 2లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను సొంతం చేసుకున్నారు. దీంతో దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమిగా కోకాపేట రికార్డు నెలకొల్పింది. కోకాపేట నియోపోలీస్ భూముల ఈ వేలంలో ఎకరం రూ. 100 కోట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్లాట్‌ నెంబర్‌ 10లో ఒక ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికింది. ప్లాట్‌ నెంబర్‌ 11లో ఎకరం రూ. 58.25 కోట్లు పలికింది. నిధుల సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ గురువారం భూముల వేలం ప్రక్రియను చేపట్టింది. కోకాపేట్‌లోని నియో పోలీస్‌ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను వేలం వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..