Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రియల్‌ఎస్టేట్‌ రంగంలో సంచలనం.. కోకాపేట్‌లో రూ. 100 కోట్లు పలికిన ఎకరం

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో HMDA భూముల వేలం జరుగుతోంది. రికార్డు స్థాయి ధర పలికి దుమ్ము దులిపేసింది కోకాపేట్ నియోపోలిస్. ఫేజ్‌ 2లో భాగంగా మోర్నింగ్‌ సెషనల్‌. 6,7, 8, 9 ప్లాట్లకు హెచ్‌ఎండీ వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి 35 కోట్ల రూపాయలుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. అయితే.. హైదరాబాద్ చరిత్రలో నియోపోలిస్‌ భూముల ధరలు రికార్డులు సృష్టించాయి. ప్లాట్‌ నెంబర్‌ 6లో ఎకరం రూ. 71.25 కోట్లు పలకగా, ప్లాట్‌ నెంబర్‌ 7లో...

Hyderabad: రియల్‌ఎస్టేట్‌ రంగంలో సంచలనం.. కోకాపేట్‌లో రూ. 100 కోట్లు పలికిన ఎకరం
Kokapet Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 03, 2023 | 8:08 PM

కోకోపేట్.. కెవ్వు కేక అంటోంది. అవును మరి… కోకాపేటా మజాకా..! రియలెస్టేట్‌ రంగంలో మళ్లీ అదరగొట్టింది కోకాపేట. కోకాపేట భూముల ధరలు కేక పుట్టిస్తున్నాయి. అంచనాలకు మించి.. రికార్డులు తిరగరాస్తూ.. రేట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో హాట్‌ కేకుల్లా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. కోకాపేట నియోపోలీస్‌ భూములు వేలంలో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న కోకాపేటలో HMDA భూముల వేలం జరుగుతోంది. రికార్డు స్థాయి ధర పలికి దుమ్ము దులిపేసింది కోకాపేట్ నియోపోలిస్. ఫేజ్‌ 2లో భాగంగా మోర్నింగ్‌ సెషనల్‌. 6,7, 8, 9 ప్లాట్లకు హెచ్‌ఎండీ వేలం వేసింది. గజం ధర సరాసరి రూ.1.5 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరం భూమికి 35 కోట్ల రూపాయలుగా ధరను నిర్ణయించింది హెచ్ఎండీఏ. అయితే.. హైదరాబాద్ చరిత్రలో నియోపోలిస్‌ భూముల ధరలు రికార్డులు సృష్టించాయి. ప్లాట్‌ నెంబర్‌ 6లో ఎకరం రూ. 71.25 కోట్లు పలకగా, ప్లాట్‌ నెంబర్‌ 7లో ఎకరం రూ. 75.50 కోట్లు పలికింది. ఇక ప్లాట్‌ నెంబర్‌ 8లో ఎకరం రూ. 63.50 కోట్లు, ప్లాట్‌ నెంబర్‌ 9లో ఎకరం రూ. 73.50 కోట్లు పలికింది.

ఇక సాయంత్రం సెషన్‌లో కోకా పేట భూముల ధరలు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సరికొత్త చరిత్రను తిరగరాశాయి. దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమి కోకాపేటదే అని తేలిపోయింది. కోకాపేట నియోపోలీస్ భూముల వేలంలో ఎకరం రూ. వంద కోట్లు దాటి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. సాయంత్రం సెషన్‌ విషయానికొస్తే.. ప్లాట్‌ నెంబర్‌ 10లో ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ప్లాట్‌ నెంబర్‌ 11లో ఎకరం రూ. 58.25 కోట్ల ధర పలికింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే గతంలో కోకాపేటలో 49 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రెండువేల కోట్ల ఆదాయం వచ్చింది. అప్పుడు కనిష్టంగా ఎకరా రూ.31 కోట్ల నుంచి అత్యధికంగా రూ.60 కోట్ల రూపాయల ధర పలికింది. ఇప్పుడు ఏకంగా ఎకరం 100 కోట్లు దాటి సన్సేషనల్‌ సృష్టించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 2500 కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

ఇక నిధుల సమీకరణ కోసం HMDA గురువారం భూముల అమ్మక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. కోకాపేట్‌లోని నియో పోలీస్‌ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. ఉదయం నిర్వహించిన వేలంలో మొత్తం నాలుగు ప్లాట్లకు వేలం చేపట్టారు. వీటిలో ఒక ఫ్లాట్ అత్యధికంగా ఎకరం ఏకంగా రూ. 72 కోట్లకు అమ్ముపోయింది. ఈ వేలంలో ప్లాట్ల కోసం రియల్టర్లు ఎగబడ్డారు.

మరిన్ని  హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం..
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం..
SRH vs GT Preview: హ్యాట్రిక్ పరాజయాలు వర్సెస్ వరుస విజయాలు..
SRH vs GT Preview: హ్యాట్రిక్ పరాజయాలు వర్సెస్ వరుస విజయాలు..
వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!