పెన్షన్ పైసలు పెంపు.. ఇకనుంచి 57 ఏండ్లకే..

పెన్షనర్ల అర్హత వయస్సును తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వృద్ధులు వితంతువులు, దివ్యాంగులు తదితరుల పెన్షన్‌ డబ్బులను కూడా పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 57 ఏండ్లు నిండిన పేదల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్‌ను వెయ్యి రూపాయల నుంచి 2,016కు పెంచారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇస్తున్న పెన్షన్‌ను […]

పెన్షన్ పైసలు పెంపు.. ఇకనుంచి 57 ఏండ్లకే..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 7:06 PM

పెన్షనర్ల అర్హత వయస్సును తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వృద్ధులు వితంతువులు, దివ్యాంగులు తదితరుల పెన్షన్‌ డబ్బులను కూడా పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 57 ఏండ్లు నిండిన పేదల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్‌ను వెయ్యి రూపాయల నుంచి 2,016కు పెంచారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు పెంచారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లుగా పెరిగిన కొత్త పెన్షన్ డబ్బులను ఈనెల 20 నుంచి పంపిణీ చేస్తామని సీఎం వెల్లడించారు.

పెన్షన్‌కు సంబంధించి బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌‌ను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. నిన్నటి వరకు కూడా పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.