Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు.. ఎప్పటినుంచంటే?
విద్యార్ధులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించేసింది తెలంగాణ ప్రభుత్వం..
విద్యార్ధులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు.. అంటే దాదాపుగా 48 రోజులు వేసవి సెలవులు అనమాట. అలాగే 2023-24 విద్యా సంవత్సరానికి గానూ స్కూల్స్ జూన్ 12వ తేదీన తిరిగి పున: ప్రారంభం కానున్నాయి
ఇదిలా ఉంటే.. 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు జరగనున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్ధులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మూడు రోజులు రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాగా, ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో.. ఈ ఎగ్జామ్స్ పూర్తి కాగానే.. వారికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.