Breaking: గాంధీ ఆసుపత్రిలో సమ్మె విరమించిన జూడాలు
గాంధీ ఆసుపత్రిలో జూడా(జూనియర్ డాక్టర్లు) సమ్మెను విరమించారు. డాక్టర్లతో మంత్రి ఈటెల రాజేందర్ చేసిన చర్చలు సఫలం అయ్యాయి.

గాంధీ ఆసుపత్రిలో జూడా(జూనియర్ డాక్టర్లు) సమ్మెను విరమించారు. డాక్టర్లతో మంత్రి ఈటెల రాజేందర్ చేసిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ సమ్మెను విరమించిన జూడాలు.. విధుల్లోకి చేరనున్నారు. కాగా జీవో నెంబర్ 103ని రద్దుచేసి టీచింగ్ హాస్పిటల్స్‌కి వెసులు బాటు కల్పించామని చర్చల్లో భాగంగా మంత్రి పేర్కొన్నారు. అలాగే డాక్టర్ల కొరతను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇకపై జూడాల సమస్యలకు ఒక కమిటిగా ఫామ్ కావాలని ఈటెల సూచించినట్లు సమాచారం. కాగా గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై వరుస దాడి నేపథ్యంలో జూడాలు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుంచి నిధులను బహిష్కరించిన దాదాపు 300 మంది జూడాలు తమ ఐదు డిమాండ్లను నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన వైద్యారోగ్య మంత్రి ఈటెల జూడాలకు హామీ ఇచ్చారు.
Read This Story Also: సునీల్‌కి షాకిచ్చిన బోయపాటి..!



