Hyderabad: టీవీ9 ప్రతినిధిపై మోహన్ బాబు పైశాచిక దాడి.. నిరసనకు జర్నలిస్ట్ సంఘాల పిలుపు
TV9 రిపోర్టర్ రంజిత్‌పై రౌడీయిజం చేసిన మోహన్‌బాబుకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరోవైపు మీడియాపై ఆయన దాడిని జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి.
న్యూస్ కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు పైశాచిక దాడిని జర్నలిస్ట్ సంఘాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని సీనియర్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టీవీ9 జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ.. బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శాంతియుత నిరసనకు జర్నలిస్టులు పిలుపునిచ్చారు.
- టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడిని ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రంజిత్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీసిన పొంగులేటి.. దాడి విషయంలో చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు మీడియాపై దాడిని ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాపై దాడిని ఖండించారు అద్దంకి దయాకర్. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు.
- టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై దాడిని ఖండించారు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు. మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన రిపోర్టర్‌పై చేయి చేసుకున్న మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్.
- జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన మోహన్‌బాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మోహన్‌బాబుపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ. రిపోర్టర్‌పై మోహన్‌బాబు దౌర్జన్యం చేయడం దారుణమన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి.
- మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీవీ9 ప్రతినిధులు. దేశానికి ఫోర్త్ ఎస్టేట్‌లాంటి మీడియాపై దాడిని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పహాడిషరీఫ్ పోలీసులను ఆశ్రయించారు టీవీ9 రిపోర్టర్స్. మోహన్ బాబుపై బీఎన్‌ఎస్ 173, 176, 118(1) సెక్షన్ల కింద సబ్‌ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
- మీడియాపై దాడి దుర్మార్గమన్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్‌శర్మ. మోహన్‌బాబు కుటుంబానికి బ్రాహ్మణశాపం వెంటాడుతోందన్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై దాడిని ఖండించారు అయ్యప్ప స్వాములు. మోహన్ బాబుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
- జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్. మోహన్‌బాబు దాడిని ఖండించింది రాజమండ్రి ప్రెస్‌క్లబ్. వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
- టీవీ9 ప్రతినిధి రంజిత్ పై దాడిని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడే అది కుటుంబ సమస్య అని, పీఎస్ వరకు వెళ్లినప్పుడు అది వ్యక్తిగత సమస్య కాదన్నారు DTJA ప్రధాన కార్యదర్శులు మహాత్మ, గోపికృష్ణ.
- వీధినపడి కొట్టుకోవడం, పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లడానికి మీడియా కచ్చితంగా చూపిస్తుందని.. ఆ కోపాన్ని భౌతిక దాడుల ద్వారా ప్రదర్శించడం దారుణమన్నారు తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లెరవి కుమార్. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. మోహన్ బాబు జరిపిన దాడిని స్మాల్ న్యూస్‌పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసోయేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఖండించారు.
- మంచు మోహన్ బాబు దాడిని ఖండించారు తెలంగాణ ఉద్యమ నేత మున్నూరు రవి. ఇంట్లో ఉన్నవారిపై కోపాన్ని మీడియా ప్రతినిధిపై చూపంచడం, ఆయనలో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇక అయ్యప్ప దీక్షలో ఉన్న వ్యక్తిని బలంగా కొట్టడాన్ని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ ఖండించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి