Viral: బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..

Viral: బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Dec 11, 2024 | 11:15 AM

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో చాలా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనేకచోట్ల అపరిశుభ్ర వాతావరణన్ని గుర్తించారు. చాలా రెస్టారెంట్లకు ఫైన్లు సైతం విధించారు. అయితే బిర్యానీ తిందామని మొదటిసారి బావర్చి రెస్టారెంట్ కు వచ్చిన ఒక కస్టమర్ కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ స్ట్రిప్ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న కస్టమర్ బావర్చి బిర్యాని యాజమాన్యాన్ని నిలదీశాడు.

బిర్యానీ తిందామని మొదటిసారి బావర్చి రెస్టారెంట్ కు వచ్చిన ఒక కస్టమర్ కు బిర్యానీలో ఏకంగా టాబ్లెట్ స్ట్రిప్ ప్రత్యక్షమైంది. తాను బిర్యాని తో పాటు మెడిసిన్ ని కూడా తింటున్నాను అంటూ వీడియో తీశాడు. ఇది ఏ మెడిసినో చెప్పాలి అంటూ బావార్చి యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఒక మెడిసిన్ స్ట్రిప్ బిర్యానీలో ఎలా ప్రత్యక్షమైందని కస్టమర్ ప్రశ్నిస్తూ వీడియో తీశాడు. దీనికి బావార్చి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వీడియో ఎందుకు తీస్తున్నావ్ అంటూ కస్టమర్ పైనే చిందులు వేశారు. గత కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బిరియానివాలాలో సైతం ఇదే తరహాలో బిర్యానీలో బొద్దింక ప్రతిక్షమైంది. ఆ ఘటనలోనూ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కనిపించింది. ఇలా కస్టమర్లు ఎంతగా ఆందోళన చెందుతున్నా సరే.. కొన్ని హోటల్స్ యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ఇలాంటి ఘటన జరిగిన సమయంలో సరైన రీతిలో స్పందించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.