Viral: పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.! వీడియో..
అక్కడ అంగరంగవైభవంగా పెళ్లి జరుగుతోంది..! పెళ్లికూతురు, పెళ్లి కొడుకు వేదిక మీద పెళ్లిపీటలపై కూర్చుని ఉన్నారు..! ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్లి తంతు కొనసాగుతోంది..! బంధుమిత్రులంతా వేదిక ముందు ఆసీనులై పెళ్లి వేడుకను వీక్షిస్తున్నారు..! అంతా సజావుగా సాగుతున్న సమయంలో పెళ్లి కొడుకు చేసిన పని ఆ పెళ్లి రద్దుకు దారితీసింది. దేశ రాజధాని ఢిల్లీలోని సాహిబాబాద్ ఏరియాలో ఈ ఘటన జరిగింది.
వరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులిద్దరూ వేదికపైకి వచ్చారు. ఒకరికొకరు పూలదండలు వేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లిపీటల మీద ఆసీనులపై పురోహితుడి సూచనల ప్రకారం పెళ్లి తంతును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగొచ్చి కాసేపటికి మళ్లీ వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీమళ్లీ అలాగే వెళ్తుండటంతో పెళ్లి కూతురుకు అనుమానం వచ్చింది. మాటిమాటికి వాష్‌రూమ్‌కు ఎందుకు వెళ్తున్నాడో కనిపెట్టండి అంటూ తన కుటుంబీకులకు కనుసైగ చేసింది. దాంతో పెళ్లికొడుకు చేస్తున్న పని తెలుసుకుని వధవు కుటుంబీకులు ఖంగుతిన్నారు. వాష్‌రూమ్ పేరు చెప్పి పెళ్లి కొడుకు వేదిక వెనకాల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతడిని తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. వరుడు మెడలో వేసిన పూలమాలను విసిరికొట్టింది.
పెళ్లి కూతురు నిర్ణయంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు దూషించుకోవడమేగాక కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. పెళ్లి రద్దయిపోయింది. శుభమా అంటూ పెళ్లి జరుగుతున్న వేళ పెళ్లికొడుకు చేసిన పిచ్చిపని తీవ్ర గందరగోళానికి దారితీసింది. పీటల మీదే పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

