Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు.. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లో.. ఎందుకంటే

శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికారులు ఫోకస్‌ పెట్టారు. కాలేజీలపై అధిక ఫీజ్‌ వసూలు... అవినీతి ఆరోపణలు రావడంతో యాక్షన్‌ పార్ట్‌ షూరు చేశారు. ఐటీ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్‌ చూద్దాం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.

Hyderabad: శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు.. ఏకకాలంలో 6 రాష్ట్రాల్లో.. ఎందుకంటే
Sri Chaitanyua
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 10, 2025 | 8:51 PM

దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో ఫీజు తీసుకుని ట్యాక్స్‌ ఎగొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి లావాదేవీలు నిర్వహిస్తూ… ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాదాపూర్‌లోని శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో రికార్డులు, డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపు రశీదులను పరిశీలించారు. డైరెక్టర్ల కార్యాలయాలనూ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నీట్, జేఈఈ పరీక్షల కోసం ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఒక్కో విద్యార్ధిని నుంచి లక్షల్లో ఫీజ్ వసూలు చేస్తోంది యాజమాన్యం. హాస్టల్, లైబ్రరీ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. ఫీజుల విషయంలోనూ ఫిర్యాదుల రావడంతో ఈ కాలేజీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కాలేజీలకు అనుమతులు లేవని, హాస్టల్ భవనాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని తేలింది. పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. కళాశాలల యజమాన్యాలు వెల్లడించిన వివరాలు, సోదాల్లో లభించిన వివరాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. సంస్థల్లో చేరుతున్న విద్యార్థులు, ఆదాయానికి సంబంధించిన వాటిపై ఆరా తీస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించిన దానిపై అధికారులు దృష్టి సారించారు.

గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!