Hyderabad: వరకట్న వేధింపులు తాళలేక.. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు. అప్పటికే వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకి చెందిన జూపల్లి శ్రీనివాసరావు.. కొన్నాళ్ల క్రితం కుటుంబంతోపాటు...

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు. అప్పటికే వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత పుట్టింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లకి చెందిన జూపల్లి శ్రీనివాసరావు.. కొన్నాళ్ల క్రితం కుటుంబంతోపాటు హైదరాబాద్(Hyderabad) కు వలసొచ్చారు. బాలకృష్ణానగర్‌లో నివాసముంటున్నారు. ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నిఖిత ఐటీ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు సిరిసిల్ల(Sircilla) కే చెందిన ఐటీ ఉద్యోగి ఉదయ్‌తో గతేడాది జూన్ 6న వివాహం చేశారు. ఆ సమయంలో రూ.10లక్షల నగదు, 35 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల భూమి ఉంది. ఆ పొలంలో సగభాగాన్ని తన పేరుమీద రాయాలని ఉదయ్ వేధిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతడి వేధింపులు తట్టుకోలేక ఇటీవలే ఉదయ్ కు మరో రూ.10 లక్షలు ఇచ్చారు. ఉదయ్‌తో పాటు నిఖిత అత్తమామలు, మరిది తీరు మారకపోవడంతో ఆమె ఏప్రిల్ 2న కూకట్‌పల్లిలో పుట్టింటికి వచ్చింది. ఈనెల 20న ఉదయ్ అక్కడికి వచ్చి గొడవ పడ్డాడు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైననిఖిత బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
నిఖిత ఆత్మహత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు.. సిరిసిల్లలోని ఉదయ్ ఇంటి ముందు ఆందోళన చేశారు. హైదరాబాద్‌లో మృతి చెందిన ఆమెకు అత్తింటి వద్దే అంత్యక్రియలు నిర్వహించాలని తీసుకు రాగా సరిహద్దు గ్రామం జిల్లెల్లలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు సిరిసిల్ల వెంకంపేటలోని ఉదయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై నిఖిత బంధువులు కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీచదవండి
Watch Video: బీహార్‌లో దారుణం.. నిందితుడి తల్లితో మసాజ్ చేయించుకున్న పోలీస్ అధికారి