IBomma Ravi Arrest: దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్ సంచలన ట్వీట్..
ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుపై హైదరాబాద్ మాజీ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారంటూ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు.

దమ్ముంటే పట్టుకోండి అన్నాడు.. హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరాడు.. కట్ చేస్తే.. ఐబొమ్మ రవి ఊచలు లెక్కబెడుతున్నాడు.. సినిమాలను పైరసీలో కింగ్‌పిన్ గా మారిన ఐబొమ్మ నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుపై హైదరాబాద్ మాజీ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారంటూ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. అంటూ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. DCP కవిత, CP సజ్జనార్ కు ఈ సందర్భంగా సివి ఆనంద్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే.. అంతకుముందు ఐబొమ్మ కేసును సీవీ ఆనంద్ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన తాజాగా ట్వీట్ చేసి కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలను రీపొస్ట్ చేశారు.
“దమ్ముంటే నన్ను పట్టుకోండి” అని పోలీసులనే సవాలు చేస్తూ బెదిరించిన వ్యక్తిని చివరకు అరెస్ట్ చేసినందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత మరియు టీమ్ కి నా అభినందనలు. ఈ సందర్భంగా హెచ్డీ మూవీ పైరసీ కేస్ ప్రెస్ మీట్ వివరాలు మళ్లీ రీపోస్ట్ చేస్తున్నాను. హ్యాకర్లు డిజిటల్…
— CV Anand IPS (@CVAnandIPS) November 15, 2025
ఐ- బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
ఐ- బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. కూకట్పల్లిలోని రవి అపార్టుమెంట్లో సోదాలు చేసిన పోలీసులు.. వందల కొద్ది హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ. 3 కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు. ఎలాంటి సర్వర్ను అయినా రవి ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ను సైతం ఇమ్మడి రవి హ్యాక్ చేశాడు.. కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులే అడ్డాగా ఐ- బొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
