హైదరాబాద్‌లోని అల్వాల్‌లో దారుణం
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ప్రత్యూష (32) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (జులై 31) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ రెడ్డి ఎంక్లేవ్ శ్రీనివాస్ నగర్‌లో నివాసం ఉంటున్న శశికాంత్ రావుకు 2013లో ప్రత్యూష (32)తో వివాహం అయింది. పెళ్లి సమయంలోనే ప్రత్యూష తండ్రి శశికాంత్ రావుకు కట్నం కింద కిలో బంగారంతోపాటు రూ. […]
అదనపు కట్నం కోసం భర్త వేధింపులు భరించలేక ప్రత్యూష (32) అనే వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం (జులై 31) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ రెడ్డి ఎంక్లేవ్ శ్రీనివాస్ నగర్‌లో నివాసం ఉంటున్న శశికాంత్ రావుకు 2013లో ప్రత్యూష (32)తో వివాహం అయింది. పెళ్లి సమయంలోనే ప్రత్యూష తండ్రి శశికాంత్ రావుకు కట్నం కింద కిలో బంగారంతోపాటు రూ. 20 లక్షలు ఇచ్చాడు. తర్వాత కూడా మరో రూ. 50 లక్షలు అదనపు కట్నం కూడా ముట్టజెప్పాడు.
కాగా… శశికాంత్ కొద్ది నెలలుగా భార్యను మరోసారి అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నాడు. భర్త వేధింపులను తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొంత సేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని బీబీఆర్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రత్యూష అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.