Uber Cabs: తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చిన డ్రైవర్‌కు షాక్ ఇచ్చిన ఉబెర్.. అసలేం జరిగిందంటే..

Uber Cabs: తన జీవితంలో అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ మొక్కులో భాగంగా అతను తిరుమలేశుడి సన్నిధికి చేరుకుని..

Uber Cabs: తిరుమల దర్శనానికి వెళ్లి వచ్చిన డ్రైవర్‌కు షాక్ ఇచ్చిన ఉబెర్.. అసలేం జరిగిందంటే..
Uber Driver
Follow us

|

Updated on: Apr 02, 2021 | 3:48 PM

Uber Cabs: తన జీవితంలో అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ మొక్కులో భాగంగా అతను తిరుమలేశుడి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించుకున్నాడు. తిరిగి సంతోషంగా ఇంటికి చేరాడు. అప్పుడే అతనికి ఊహించని షాక్ తగిలింది. అతను చేయించుకున్న గుండు కారణంగా ఉన్న జాబ్ ఊడిపోయింది.

అసలే జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఉబెర్ సంస్థలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల అతను తిరుమలకు వెళ్లాడు. అక్కడ స్వామి వారికి తలనీలాలు సమర్పించి తిరిగి సిటీకి వచ్చాడు. రోజూ లాగే ఉబెర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించాడు. అయితే, అదికాస్తా బెడిసి కొట్టింది. శ్రీకాంత్ గుండు చేయించుకోవడం వల్ల అతని ఫోటో రికగ్నై్జ్ కాలేదు. దాంతో పలుమార్లు లాగిన్ కోసం ట్రై చేయగా.. అది కాస్తా బ్లాక్ అయ్యింది. రాంగ్ ఎంట్రీ ఇచ్చినందుకు అతని ఐడీని బ్లాక్ చేశారు. దాంతో శ్రీకాంత్ ఉద్యోగం పోయింది.

ఇదే అంశంపై శ్రీకాంత్ ఉబెర్ ఆఫీసుకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని చెప్పాడు. తన ఐడీ అన్‌ బ్లాక్ చేసి ఫోటో ఛేంజ్ చేయాలని వేడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. “నేను ఉబెర్ కార్యాలయానికి వెళ్లాను. జరిగిన పొరపాటు గురించి ఉబెర్ యాజమాన్యానికి విన్నవించాను. కానీ వారి నుంచి సరైన స్పందన రావడం లేదు. డ్రైవర్‌గా తనను తిరిగి నియమించడానికి వారు ఒప్పుకోవడం లేదు. నేను గత నెల రోజుల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా కుటుంబం మొత్తం నాపైనే ఆధారపడి ఉంది. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి.’’ అంటూ శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, 2019లో ఉబెర్‌లో చేరిన శ్రీకాంత్.. ఇప్పటి వరకు దాదాపు 1,428 ట్రిప్పులను పూర్తి చేసి 4.67 రేటింగ్‌ను కలిగి ఉన్నాడు.

శ్రీకాంత్ దీన పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉబెర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ఉబెర్ సంస్థ డ్రైవర్లను ఇలా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడుతున్నారు. ఇక కరోనా తర్వాత క్యాబ్ కంపెనీలు డ్రైవర్లను వేధిస్తున్నాయని యాప్ బేస్డ్ క్యాబ్ డ్రైవర్ల స్టేట్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్​ఆరోపించారు. ఉబెర్ ఒక్కటే కాదని, ఓలాలోనూ డ్రైవర్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. శ్రీకాంత్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read:

Assembly Elections 2021: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ.. ప్రియాంక గాంధీ పర్యటనలన్నీ రద్దు.. కారణమేంటంటే..

దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..