Assembly Elections 2021: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ.. ప్రియాంక గాంధీ పర్యటనలన్నీ రద్దు.. కారణమేంటంటే..

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్‌ ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం అర్థాంతరంగా రద్దయ్యింది.

Assembly Elections 2021: కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ.. ప్రియాంక గాంధీ పర్యటనలన్నీ రద్దు.. కారణమేంటంటే..
Priyanka Gandhi
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 02, 2021 | 3:11 PM

Priyanka Gandhi Vadra: కాంగ్రెస్‌ ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం అర్థాంతరంగా రద్దయ్యింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె కూడా సెల్ఫ్ క్వారంటైన్‌ అయ్యారు. అయితే, ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. నెగిటివ్ అని తేలింది. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను కరోనా పరీక్ష చేయించుకోగా.. నెగిటివ్ అని తేలిందని, అయితే, వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ క్వారంటైన్ అయినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

కాగా, కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ మరణంతో కన్యాకుమారి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి కూడా తమిళనాడు అసెంబ్లీతో పాటే పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వి. విజయకుమార్‌ను నిలబెట్టగా.. ఆయనకు మద్ధతుగా ప్రియాంకా గాంధీ ప్రచారం చేయాల్సి ఉంది. ఏప్రిల్ 6వ తేదీనే ఎన్నికలు ఉండగా.. ఇంతలో ప్రియాంక గాంధీ సెల్ఫ్ క్వారెంటైన్ అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.

ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికలున్న అస్సాం, కేరళ రాష్ట్రాలలో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ఇప్పటివరకు అస్సాంలో రెండుసార్లు పర్యటించగా.. మూడోసారి ఇవాళ పర్యటించాల్సి ఉంది. ఇంతలో కరోనా విషయం తెలియడంతో ప్రియాంక గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగే ర్యాలీలలో కూడా ఆమె ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, ఆ పర్యటన కూడా రద్దు అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.

Priyanka Gandhi Vadra Tweet:

Also read:

Lockdown: మాస్క్ పెట్టుకోండి మొర్రో అంటున్నా వినరు.. మరోసారి దూసుకొచ్చింది.. మూడు వారాాలు లాక్‌డౌన్‌ పడింది…

CBSE Exams: కోవిడ్‌ కారణంగా ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాలేదా.? అయితే డోంట్‌ వర్రీ.. సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా