CBSE Exams: కోవిడ్ కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేదా.? అయితే డోంట్ వర్రీ.. సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్..
CBSE Practical Exams: కరోనా కారణంగా దారి తప్పిన విద్యా వ్యవస్థ ఇటీవలే మళ్లీ గాడిలో పడిందని అంతా భావించారు. కానీ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఓ వైపు అకడమిక్ దగ్గరపడుతుండడంతో...
CBSE Practical Exams: కరోనా కారణంగా దారి తప్పిన విద్యా వ్యవస్థ ఇటీవలే మళ్లీ గాడిలో పడిందని అంతా భావించారు. కానీ మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఓ వైపు అకడమిక్ దగ్గరపడుతుండడంతో పరీక్షల నిర్వహణ కత్తి మీద సాముగా మారింది. ఈ క్రమంలోనే సీబీఎస్ ఇప్పటికే 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. అయితే కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాలేరు. దీంతో పరీక్షలకు హాజరుకాలేక పోయిన విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ బోర్డు తాజాగా శుభవార్త చెప్పింది. విద్యార్థులు కోవిడ్ బారిన పడడం లేదా వారి కుటుంబాల్లో వ్యక్తులు ఎవరైనా కరోనా బారిన పడడంతో పరీక్షలకు హాజరుకాలేక పోతే వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేని వారు జూన్ 11లోపు ఎప్పుడైనా పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు. సీబీఎస్‌బీ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి నెలలో జరిగాయి. ఇక బోర్డ్ ఎగ్జామ్స్‌ను మే 4 నుంచి నిర్వహించేందుకు బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా ప్రాక్టికల్స్‌కు హాజరు కాలేని విద్యార్థులు తర్వాత రాసుకునే అవకాశం కల్పించినట్లు సీబీఎస్‌ఈ ఎగ్జామ్ కంట్రోలర్ సాన్యమ్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇదివరకు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్స్‌కు హాజరవుతోన్న 10, 12వ తరగతి విద్యార్థులు పరీక్ష సెంటర్లను తమకు నచ్చిన చోటుకు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పేరెంట్స్ పట్టణాలు వదిలి సొంతూళ్లకు పయణమయ్యారు. ఈ కారణంతోనే సీబీఎస్‌ఈ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Also Read: ESIC Recruitment 2021: ఇంటర్, డిగ్రీ అర్హత ఉందా..! భారీ వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..