TSPSC: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే.!

TSPSC Recruitment 2021: నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గుడ్ న్యూస్ అందించింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్...

TSPSC: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే.!
Jobs
Follow us

|

Updated on: Apr 02, 2021 | 6:17 PM

TSPSC Recruitment 2021: నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గుడ్ న్యూస్ అందించింది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలని సూచించింది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి అభ్యర్ధులు అఫీషియల్ వెబ్‌సైట్ tspsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.

అలాగే ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీ, ఫీజు చెల్లింపు లాస్ట్ డేట్ మే 5వ తేదీగా నిర్ణయించింది. పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలలోని ఖాళీలకు టీఎస్‌పిఎస్‌సి ఈ నియామకాన్ని నిర్వహిస్తోంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి…

  • వయోపరిమితి: 18-34 వయస్సు

  • యూనివర్శిటీ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా లేదా బిసిఎ డిగ్రీ లేదా ఎలిక్టివ్ సబ్జెక్టులలో ఒకదానితో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ.

  • లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

ఎంపిక విధానం:

టిఎస్‌పిఎస్‌సి 10 వేర్వేరు కేంద్రాల్లో ఒక పరీక్ష (సిబిటి లేదా రాత) నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన తేదీలు త్వరలోనే ప్రకటిస్తారు.

దరఖాస్తు రుసుము:

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు – రూ .200

  • పరీక్ష ఫీజు – రూ .80 చెల్లించాలి.

టీఎస్పీఎస్సీ రిక్రూట్‌మెంట్ డీటైల్స్…

    • సీనియర్ అసిస్టెంట్(పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ) – 15 ఖాళీలు ( జీతం – 22,460 – 66,330)

    • జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్((పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ) – 10 ఖాళీలు ( జీతం – 16,400 – 49,870)

    • జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్((జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ) – 102( జీతం – 16,400 – 49,870)

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!