Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు అలెర్ట్.. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం రేపు (ఏప్రిల్30) ప్రారంభ కానుంది. సీఎం కేసీఆర్ ఆదివారం లాంఛనంగా ఈ నూతన సెక్రటేరియట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం రేపు (ఏప్రిల్30) ప్రారంభ కానుంది. సీఎం కేసీఆర్ ఆదివారం లాంఛనంగా ఈ నూతన సెక్రటేరియట్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు కానున్నాయి. దీంతో సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్ మధ్య వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ను పూర్తిగా మూసివేయనున్నారు. అలాగే ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదాన్, నిరంకారి భవనం వైపు మళ్లిస్తారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- నిరంకారి, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలకుఅనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌ను మూసివేయనున్నారు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్‌కు మళ్లిస్తారు.
- ట్యాంక్ బండ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
- బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
- బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరి నుంచి వైపు వచ్చే వాహనాలకు పర్మిషన్ లేదు. ఈ వాహనాలను బడా గణేశ్ లేన్ నుంచి రాజ్‌ధూత్ లేన్ వైపునకు మళ్లించనున్నారు.
- ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబనీ పార్కు పరిసరాలను మూసివేయనున్నారు.
- అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు.. రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా సికింద్రాబాద్ వెళతాయి.
- వీవీ విగ్రహం జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ టెంపుల్, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు వాహనాలకు ప్రవేశం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..