Hyderabad: అయ్యో.. చిట్టి తల్లీ.. రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా..?

హైదరాబాద్‌ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కిందపడి రెండేళ్ల పాప మృతి చెందింది. తన తండ్రి, అమ్మమ్మతో కలిసి సోదరుడిని స్కూల్‌ బస్సు ఎక్కించడానికి చిన్నారి జావ్లానా రోడ్డుపైకి వచ్చింది. ఆ తర్వాత....

Hyderabad: అయ్యో.. చిట్టి తల్లీ.. రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా..?
Jawlana With Father
Follow us

|

Updated on: Jan 04, 2024 | 3:08 PM

ఒకటికి.. వందసార్లు చెబుతున్నాం.. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అస్సలు నిర్లక్ష్యం వద్దు. వారికి ఏది ప్రమాదమో తెలీదు. తాజాగా హైదరాబాద్‌ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌ కాలనీలో ఓ చిట్టి తల్లి అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచింది. అన్న స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు కిందపడి స్పాట్‌లోనే రెండేళ్ల చిన్నారి చనిపోయింది.

వివరాల్లోకి వెళితే… రవీంద్ర నగర్ కాలనీలో నివాసం ఉండే మిథున్‌కు ఇద్దరు పిల్లలు. కూమారుడు స్థానికంగా ఓ పాఠాశాలలో చదువుతుండగా.. రెండేళ్ల పాప జావ్లానా ఇంటి వద్దే ఉంటుంది. అయితే జనవరి 4న ఉదయం పిల్లోడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు.. తండ్రి, అమ్మమ్మ బయటకు వచ్చారు. ఆ సమయంలో పాప కూడా వారితోనే ఉంది.

తన కుమారుడిని స్కూల్ బస్ ఎక్కించిన మిథున్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగా..  అమ్మమ్మ వద్ద ఉన్న చిన్నారి.. నాన్న అంటూ అతడి వద్దకు ఒక్కసారిగా పరిగెత్తింది. ఈ క్రమంలో డ్రైవర్ గమనించక.. బస్సును మూవ్ చేయడంతో ప్రమాదవశాత్తు టైరు కిందపడి అక్కడికక్కడే బుజ్జి తల్లి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్పాట్‌కు చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..