Hyderabad: పొద్దున్నే హాస్టల్ నుంచి క్లాస్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులు.. ఊహించని షాక్.. ఫ్యాన్‌కు వేలాడుతూ
హైదరాబాద్ గౌలిదొడ్డిలో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. కాలేజీ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.
Telangana: హైదరాబాద్ గౌలిదొడ్డి( Gaulidoddi)లో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. కాలేజీ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. హైదరాబాద్ గౌలిదొడ్డిలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకున్నాడు. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఫస్టియిర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడిని నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ(Charagonda village) గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య – సువర్ణ రెండో కుమారుడు వంశీ కృష్ణగా గుర్తించారు. ఇతనికి 17 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి కూడా 10 గంటల వరకు స్టడీ అవర్స్‌లో పాల్గొన్నాడు వంశీ. హాస్టల్‌లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుని రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్ రూమ్‌కి వెళ్లాడు. ఉదయాన్నే లేచిన తోటి స్టూడెంట్స్‌కు గదిలో వంశీ కనిపించలేదు. అతని కోసం వెతగ్గా.. తరగతి దగిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు.
విద్యార్థి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిరాసిన సూసైడ్ లెటర్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9కు చిక్కిన సూసైడ్ నోట్‌లో తాను కాలేజీలో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు స్పష్టమైంది. సూసైడ్ నోట్‌ను బయటకు రాకుండా పోలీసులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య ఘటనపై కళాశాల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు విద్యార్థి కుటుంబసభ్యులు. కొడుకు ఆత్మహత్యపై మండిపడుతున్నారు విద్యార్థి తండ్రి. తమకు తెలియకుండా విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపండంపై ఫైరవుతున్నారు.
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్
సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం