AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తీరు మార్చుకోలేదు అధికారులు.. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ జారీ చేసిన సీపీ..

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ లోని దక్షిణ మండలం అత్యంత కీలకమైన జోన్ అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో సాధారణంగా అధికారులు కూడా అంచనాలు వేయలేకపోతుంటారు.. ఆ ప్రాంతంలో ఐపిఎస్ స్థాయి అధికారి ప్రస్తుతం ఉన్న పండగల హడావుడిలో అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ పై సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బిజీబిజీగా ఉంటున్న ఈ ప్రాంతంలో ఇన్స్పెక్టర్లు అధికారులు మాత్రం తనకేమి తెలియనట్టు బాధ్యత లేని విధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఏకంగా ట్రాన్స్ఫర్ సరైన మార్గమని భావించి చివరకు ట్రాన్స్ఫర్ చేసారు నగర కమిషనర్ సివి ఆనంద్.

Hyderabad: తీరు మార్చుకోలేదు అధికారులు.. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ జారీ చేసిన సీపీ..
Telangana Police
Noor Mohammed Shaik
| Edited By: Shiva Prajapati|

Updated on: Sep 17, 2023 | 7:23 AM

Share

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ లోని దక్షిణ మండలం అత్యంత కీలకమైన జోన్ అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో సాధారణంగా అధికారులు కూడా అంచనాలు వేయలేకపోతుంటారు.. ఆ ప్రాంతంలో ఐపిఎస్ స్థాయి అధికారి ప్రస్తుతం ఉన్న పండగల హడావుడిలో అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ పై సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ బిజీబిజీగా ఉంటున్న ఈ ప్రాంతంలో ఇన్స్పెక్టర్లు అధికారులు మాత్రం తనకేమి తెలియనట్టు బాధ్యత లేని విధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఏకంగా ట్రాన్స్ఫర్ సరైన మార్గమని భావించి చివరకు ట్రాన్స్ఫర్ చేసారు నగర కమిషనర్ సివి ఆనంద్.

మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ విషయానికొస్తే ఇక్కడ షియా సున్ని వర్గాలతో పాటు హిందువులు కూడా ఉంటారు షియా ముస్లింల సంతాప దినాలు చివరి దిశలో ఉండగా సునీల మీలాదున్నబి పండుగ హడావుడి మొదలుకానుంది మరోవైపు హిందువులకు వినాయక చవితి కూడా హడావుడి మొదలైపోవడంతో ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ బాధ్యతారకంగా వివరించాల్సింది పోయి ఏకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ మధ్యకాలం తరచూ ఇన్స్పెక్టర్ పై పదేపదే ఉన్నత స్థాయి. అధికారులకు ఫిర్యాదులు రావడంతో స్థానిక డిసిపి ఏసిపి స్థాయి అధికారులు కూడా పలుమార్లు పద్ధతులు మార్చుకొని వ్యవహరించాలని చెప్పడం జరిగింది తనే రాజు తనే మంత్రి లా వ్యవహరించి ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి ఏర్పడింది

హుసేని ఆలం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన కొన్ని మతకలహాలు ఇప్పటికీ మర్చిపోలేనివి ఇక్కడ ఎప్పుడు హిందూ ముస్లిం హడావుడి ఎక్కువగా ఉన్నప్పటికీ వినాయక చవితి అత్యంత కీలమైన పండుగ మరోవైపు ముస్లిం ప్రవక్త పుట్టినరోజు సంబరాలు కూడా వచ్చేయడంతో హడావుడి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది పాతబస్తీలోకీలకమైన ఈ ప్రాంతంలో ప్రముఖ ముస్లిం మత పెద్దలతో పాటు పలు పార్టీ నేతలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటారు శాంతి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ నిద్రలేని రాత్రులు ఉన్నత స్థాయి అధికారులు గడుపుతుంటే ఇన్స్పెక్టర్ మాత్రం దర్జాగా తనకి ఏమి తెలియనట్టు తన ఏరియాలో ఎలాంటి హడావుడి లేనట్టు వ్యవహరించిన తీరే ఇప్పుడు వివాదాస్పదమైంది మందలించి హెచ్చరించి లాభం లేకపోవడంతో ట్రాన్స్ఫర్ చేసి ఆ అధికారికి న్యాయం చేశారు ఉన్నత స్థాయి అధికారులు బహుశా ఇలాంటి హడావుడి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ అధికారులు చరిత్రలో మిగిలిపోతారు సరైన టైంలో ఉన్నత స్థాయి అధికారులు అలర్ట్ అవ్వడంతో మరింత విధుల్లో నిర్లక్ష్యం జరగకముందే ట్రాన్స్ఫర్ చేసి బాధితరహితంగా పనిచేసే అధికారులని ఇక్కడకి పంపించడం సంతోషంగా ఉందని ఇరువర్గాల ప్రతినిధులు నగర కోత్వాల్ నిర్ణయానికి స్వాగతించారు

సైదాబాద్ ఈ ప్రాంతం ఒకప్పుడు టెర్రరిజానికి పెట్టిన పేరు 24 గంటలు హడావుడిగా ఉండే ఈ ప్రాంతంపై కేంద్ర రాష్ట్ర నగర పోలీస్ యంత్రాంగాలు ఒక్కన్నేసి ఉంచే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఎస్ హెచ్ ఓ చాలా యాక్టివ్ గా అలెర్ట్ గా ఉండి లా అండ్ మెయింటైన్ చేస్తూ సామాజిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలలో మమేకమై ఇక్కడ డ్యూటీలో నిర్వహిస్తుంటారు అలాంటి ఏరియాలో ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం ప్రజల ఆగ్రహానికి గురిచేసింది ఉన్నత స్థాయి అధికారులు విచారించి సమాచారం తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి ఈ ప్రాంతం పై అవగాహన ఉండి ఇక్కడ ప్రజలతో మమేకమై విధులు నిర్వహించే అధికారికి ఇక్కడికి పంపడం చాలా మంచి పరిణామం అని స్థానికులు నగర కోత్వాలపై పొగడతలతో ముంచేత్తుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..