Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

Hyderabad Water Supply: తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్

Hyderabad Water Supply: భాగ్యనగరవాసులకు అలెర్ట్.. ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం
Hyderabad Water Supply
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 26, 2021 | 6:38 PM

Hyderabad Water Supply: తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై స్కీం (ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2లో క‌లాబ్‌గూర్ నుంచి ప‌టాన్‌చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివార‌ణ‌కు మరమ్మతులు, కంది గ్రామం వ‌ద్ద జంక్షన్ ప‌నులు చేపట్టనుంది. ఆ కారణంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది.

తాగునీటి సరఫరా బంద్..  తేదీ: 29.10.2021 శుక్రవారం ఉద‌యం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేదీ: 30.10.2021 శ‌నివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ 36 గంటలపాటు మంజీరా డ్రింకింగ్‌ వాట‌ర్ స‌ప్లై స్కీం(ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2 ప‌రిధిలోకి వ‌చ్చే ప‌టాన్‌చెరు నుంచి హైద‌ర్‌న‌గ‌ర్ వ‌ర‌కు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9: హైద‌ర్‌న‌గ‌ర్‌, రాం న‌రేష్‌న‌గ‌ర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యన‌గ‌ర్‌, వ‌సంత్ న‌గ‌ర్‌, ఎస్‌పీన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలు.

2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 15: మియాపూర్‌, దీప్తిన‌గ‌ర్‌, శ్రీన‌గ‌ర్‌, మాతృశ్రీన‌గ‌ర్‌, ల‌క్ష్మీన‌గ‌ర్‌, జేపీ న‌గ‌ర్‌, చందాన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలు.

3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 23: నిజాంపేట్‌, బాచుప‌ల్లి, మ‌ల్లంపేట‌, ప్రగ‌తిన‌గ‌ర్‌.

4. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 32: బొల్లారం.

కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదారాబాద్ జలమండలి అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

Also Read:

Mohammed Shami: ఎట్టకేలకు స్పందించిన బీసీసీఐ.. ఆ బౌలర్ ఆటతో గర్వపడుతున్నామంటూ ట్వీట్..!

Rahul Gandhi: ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు సమన్లు..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!