AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు సమన్లు..

Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో

Rahul Gandhi: ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై.. రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు సమన్లు..
Rahul Gandhi
Shaik Madar Saheb
|

Updated on: Oct 26, 2021 | 6:19 PM

Share

Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2019, ఏప్రిల్‌ 13న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ‘మోదీ’ ఇంటి పేరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి. దీంతో గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సూరత్‌ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో రాహుల్ గాంధీ గతంలో పలుసార్లు కోర్టుకు హాజరయ్యారు. రాహుల్‌ తరఫున న్యాయవాది కిరీట్‌ పన్వాలా మాట్లాడుతూ.. ఇద్దరు కొత్త సాక్షుల వాంగ్మూలాలపై.. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు 29న హాజరుకావాలని కోర్టు రాహుల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని.. పన్వాలా వెల్లడించారు. నిన్న జరిగిన విచారణలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏఎన్ దవే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

కాగా.. 2019లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ఇంటి పేరు (మోదీ) పై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వాళ్లందరి ఇంటి పేరు మోదీనే చూశారా!.. దొంగలందరి ఇంటి పేరు సాధారణంగా ఒకటే ఎందుకు వచ్చింది.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ సమాజాన్ని పరువు తీసేలా ప్రవర్తించారిన ఎమ్మెల్యే రాహుల్‌పై ఫిర్యాదుచేశారు. రాహుల్ గాంధీపై సెక్షన్‌లు 499, 500 కింద పరువు నష్టం దావా వేశారు. కాగా.. పూర్ణేష్ మోడీ ఇప్పుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

Also Read:

Sonia Gandhi – PK: లీడర్లంతా అప్‌డేట్ కావాల్సిందే.. పీకే సలహాలతోనే కాంగ్రెస్ నాయకులకు సోనియా క్లాస్..

Rajasthan: ప్రేమను అంగీకరించలేదని మహిళను నరికి చంపాడు.. ఆపై ఆమె మృతదేహాన్ని కౌగిలించుకున్నాడు..

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..