AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: ప్రేమను అంగీకరించలేదని మహిళను నరికి చంపాడు.. ఆపై ఆమె మృతదేహాన్ని కౌగిలించుకున్నాడు..

Rajasthan: రాజస్థాన్‌లోని అహోర్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. మహిళ తన ప్రేమను అంగీకరించలేదనే ఆగ్రహంతో.. అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు ఓ యువకుడు.

Rajasthan: ప్రేమను అంగీకరించలేదని మహిళను నరికి చంపాడు.. ఆపై ఆమె మృతదేహాన్ని కౌగిలించుకున్నాడు..
Crime
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2021 | 6:15 PM

Share

Rajasthan: రాజస్థాన్‌లోని అహోర్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. మహిళ తన ప్రేమను అంగీకరించలేదనే ఆగ్రహంతో.. అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అహోర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు శాంతి దేవికి వివాహం అయ్యింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆమె భర్త శాంతిలాల్ మహారాష్ట్రంలో పని చేస్తున్నాడు. అయితే, తాజాగా ఆమె ఉపాధి హామీ పథకం కింద పనికి వెళ్లింది.

అదే గ్రామానికి చెందిన గణేష్ మీనా(21).. పని చేస్తున్న దేవి వద్దకు వెళ్లి.. తాను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. తనను ప్రేమించాలని కోరాడు. అయితే, దేవి అందుకు నిరాకరించింది. తనకు వివాహం అయ్యిందని వివరించే ప్రయత్నం చేసింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గణేష్.. పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని దాడి చేశాడు. ఆమె చనిపోయేంత వరకు అత్యంత కిరాతకంగా నరికాడు. గణేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన దేవి.. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడించింది. అయితే, దేవి ప్రాణాలు విడిచాక అతనిలోని సైకోయిజం మరింత బయటపడింది. దేవి మృతదేహాన్ని గణేష్ కౌగిలించుకుని నేలపైనే పడుకున్నాడు.

అయితే, దేవిపై గణేష్ దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, గొడ్డలితో వారిని సైతం భయబ్రాంతులకు గురి చేశాడు. దగ్గరికి వస్తే చంపేస్తానంటూ హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన వారు వెనక్కి తగ్గారు. విషయాన్ని పోలీసులకు చేరవేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవి మృతదేహాన్ని కౌగిలించుకుని పడుకున్న గణేష్‌ని చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. దేవి మృతదేహాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించాడు. చాలాసేపటి తరువాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గణేష్ మీనా అనే యువకుడు.. శాంతి దేవిపై వ్యామోహం పెంచుకున్నాడని, ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా ఆమెను వేధింపులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. గణేష్ వేధింపుల విషయాన్ని దేవి తన భర్తకు కూడా తెలిపిందని, ఆ సమయంలో గణేష్ తప్పించుకు తిరిగాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో గణేష్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also read:

Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్

Samantha: సమంతకు ఊరట.. ఆ లింకులు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

T20 World Cup 2021లో భారత్-పాకిస్తాన్ మరోసారి ఢీకొనే ఛాన్స్.. ఎక్కడ, ఎలానో తెలుసా?