Mohammed Shami: ఎట్టకేలకు స్పందించిన బీసీసీఐ.. ఆ బౌలర్ ఆటతో గర్వపడుతున్నామంటూ ట్వీట్..!

BCCI: ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలిసారి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. అప్పటి నుంచి మహమ్మద్ షమీని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Mohammed Shami: ఎట్టకేలకు స్పందించిన బీసీసీఐ.. ఆ బౌలర్ ఆటతో గర్వపడుతున్నామంటూ ట్వీట్..!
పాకిస్తాన్‌కు ఇప్పటికే 4 పాయింట్లు ఉండటంతో.. ఈ 6 పాయింట్లు కూడా జోడిస్తే.. 10 అవుతాయి. న్యూజిలాండ్‌కు 8 పాయింట్లు ఉంటాయి.
Follow us
Venkata Chari

|

Updated on: Oct 26, 2021 | 7:29 PM

T20 world cup 2021: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రపంచకప్‌లో పాక్ చేతిలో టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమితో ఆగ్రహించిన అభిమానులు భారత ఆటగాళ్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అదే సమయంలో, జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన మతాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే షమీకి సచిన్ టెండూల్కర్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాల మద్దతు లభించింది. అయితే బీసీసీఐ మాత్రం 48 గంటల తరువాత వీటిపై స్పందించింది.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ సరిగా బౌలింగ్ చేయలేదు. జట్టుకు అత్యంత ఖరీదైన బౌలర్‌గా మారాడు. షమీ 3.5 ఓవర్లలో 11.20 ఎకానమీ రేటుతో 43 పరుగులు ఇచ్చాడు. ఈ సమయంలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్ తర్వాత, అభిమానులు అతని సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో షమీకి అండగా పలువరు మాజీలు, క్రీడాకారులు ఇప్పటికే మద్దతు పలికినా.. బీసీసీఐ, భారత ప్రస్తుతం ఆటగాళ్లు మాత్రం ఎలాంటి బహిరంగ మద్దతు పలకలేదు.

48 గంటల తర్వాత స్పందించిన బీసీసీఐ.. గత 48 గంటల్లో అభిమానులే కాకుండా పలువురు అనుభవజ్ఞులు కూడా షమీకి మద్దతుగా నిలిచారు. అయితే ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, అత్యంత శక్తివంతమైన బోర్డు తన ఆటగాడి విషయంలో మాత్రం బాగా లేట్ చేసింది. ఎట్టకేలకు 48 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, బీసీసీఐ షమీకి మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. విరాట్ కోహ్లీతో కలిసి ఉన్న మహమ్మద్ షమీ ఫొటోను బీసీసీఐ షేర్ చేసింది. ‘గర్వంగా (భారత జెండా ఎమోజీని వాడారు), బలంగా, విజయంలోనూ అపజయంలోనూ తోడుగా ఉంటాం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో, షమీని చూసి గర్వపడుతున్నామని, మిగతా మ్యాచుల్లో బలంగా ముందుకుసాగుతామని సందేహం ఇచ్చింది.

సచిన్ టెండూల్కర్ కూడా.. సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ, ‘మేము టీమిండియాకు మద్దతుగా నిలిచాం. అలాగే టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్కరికీ మేం మద్దతిస్తాం. మహ్మద్ షమీ నిబద్ధత కలిగిన ఆటగాడు. ప్రపంచ స్థాయి బౌలర్. అతనికి ఇదో చెడ్డ రోజు. ఆటలోని ఏ ఆటగాడికైనా ఇది జరగవచ్చు. నేను పూర్తిగా షమీతో పాటు టీమిండియాకు అండగా నిలుస్తానంటూ’ చెప్పుకొచ్చాడు.

Also Read: T20 World Cup 2021లో భారత్-పాకిస్తాన్ మరోసారి ఢీకొనే ఛాన్స్.. ఎక్కడ, ఎలానో తెలుసా?

Anushka Sharma: ఆటగాళ్ల భార్యలనూ వదలని ట్రోలర్స్.. అనుష్క శర్మను తాకిన టీమిండియా ఓటమి సెగ

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?