Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma: ఆటగాళ్ల భార్యలనూ వదలని ట్రోలర్స్.. అనుష్క శర్మను తాకిన టీమిండియా ఓటమి సెగ

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ మ్యాచులో రాణించలేని ఆటగాళ్ల భార్యలపై విపరీతమైన ట్రోల్‌ జరుగుతున్నాయి.

Anushka Sharma: ఆటగాళ్ల భార్యలనూ వదలని ట్రోలర్స్.. అనుష్క శర్మను తాకిన టీమిండియా ఓటమి సెగ
Anushka Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Oct 26, 2021 | 4:49 PM

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. విజయం సాధిస్తే ​​తమ అభిమాన ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తే వారు.. ఓటమిని తట్టుకోలేక అదీ పాక్‌పై భారత్ ఓడిపోయే సరికి ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ట్రోలింగ్‌కు తెరలేపారు. అయితే ఆటగాళ్లనే కాకుండా వారి భార్యలను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇప్పటికే టీమిండియా బౌలర్ షమీపై ఓ రేంజ్‌లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షమీకి మాజీ క్రికెటర్ల నుంచి పూర్తిగా మద్దతు లభిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వర్సెస్ పాకిస్థాన్‌ మ్యాచులో రాణించలేని ఆటగాళ్ల భార్యలపై విపరీతమైన ట్రోల్‌ జరుగుతున్నాయి. ఇందులో మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు.

‘జంతువుల గురించి చింతించడం మానేయండి, మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అని అనుష్కకు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ప్రదర్శన చేసినప్పుడల్లా, అభిమానులు అతని భార్య అనుష్క శర్మను ట్రోల్ చేయడం ప్రారంభించడం తెలిసిందే. అయితే పాక్‌తో మ్యాచులో టీమిండియా ఓడిపోవడంపై విరాట్ కోహ్లీతోపాటు ఆయన భార్యను ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా.. ట్రోల్స్ ఆగడం లేదు. ఈ ఓటమికి అనుష్కనే కారణమని ఆరోపిస్తున్నారు. కర్వా చౌత్ ఉపవాసం చేయలేదా అని చాలా మంది యూజర్లు అనుష్కకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “అనుష్క మీ భర్త కోహ్లీని జాగ్రత్తగా చూసుకోండి. జంతువుల గురించి చింతించడం మానేయండి” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. నవంబర్ 2015లో అనుష్క పోస్ట్ చేసిన ఫోటోతో ఇలా ట్వీట్ చేశాడు. ఆ సమయంలో, దీపావళి పండుగ రోజు పటాకులు కాల్చడానికి గుర్రాన్ని చూపిస్తూ.. జంతువులు తట్టుకోలేవని అనుష్క ఆందోళన వ్యక్తం చేసింది. మరొక యూజర్ ‘ఈసారి కర్వా చౌత్ ఉపవాసం పాటించలేదా?’ అని కామెంట్ చేశాడు. 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లి పేలవ ప్రదర్శన కనబర్చడంతో అనుష్కను విసరీతంగా ట్రోల్స్ చేశారు. అయితే దీనిపై విరాట్ కోహ్లీనే స్వయంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపాలంటూ కోరాడు.

మరోవైపు షమీపై వస్తున్న ట్రోల్స్‌పై హసీన్ జహాన్ మాట్లాడుతూ- షమీ సోదరుడికి మద్దతు ఇవ్వండి. భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా దాడి చేస్తున్నారు. హసీన్‌ జహాన్‌పై కూడా ట్రోల్‌ మొదలైంది. హసీన్ జహాన్ తన కుమార్తెతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ నా విలువైన ప్రేమ అని క్యాప్షన్‌లో రాసింది. షమీతో వివాదాల నడుమ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షమీ భాయ్‌కు మద్దతివ్వాలని హసీన్‌ జహాన్‌కు కొంతమంది యూజర్లు సలహా ఇస్తున్నారు. మహ్మద్ షమీకి మద్దతు ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

ఇండో-పాక్ మ్యాచ్‌లో సానియా మీర్జా కూడా లక్ష్యంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. రెండు రోజులుగా సోషల్ మీడియాలో కనిపించకుండా పోయిన టేబుల్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా.. తరచుగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ట్రోలర్స్ లక్ష్యంగా మారనుంది. ఈసారి, భారత టెన్నిస్ స్టార్, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జా ద్వేషం, దుర్వినియోగాన్ని నివారించడానికి ఇండో-పాక్ మ్యాచ్ రోజున సోషల్ మీడియా నుంచి అదృశ్యమవుతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ భార్య షామియా హసన్ అలీ కూడా తీవ్రంగా ట్రోల్స్‌కి గురైంది. షామియా హసన్ భారతీయురాలు. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టి ఉండవచ్చు, కానీ 44 పరుగులు సమర్పించుకున్నాడు. చాలా ఖరీదైనదిగా మారడంతో ఆయన భార్యను టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. హసన్ అలీ, షామియా 2019లో పెళ్లి చేసుకున్నారు.

షర్మిలా ఠాగూర్, సంగీతా బిజ్లానీలను కూడా అభిమానులు నేరస్థులుగా పరిగణించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు వారికి లేనప్పటికీ, ఓటమి తరువాత క్రికెటర్ల భార్యలను కూడా టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటి, సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన భర్త, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తన ప్రదర్శన పేలవంగా ఉన్నప్పుడల్లా అవమానాలకు గురయ్యాడు. బెదిరింపులు కూడా వచ్చాయి. అదే సమయంలో, నటి సంగీతా బిజ్లానీ కూడా 1996 ప్రపంచ కప్ సమయంలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు, ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో భారత్ ఓడిపోవడంతో.. ఈ ఓటమికి ఆయనే కారణమని అభిమానులు విమర్శలు గుప్పించారు.

Also Read: Virat Kohli: ‘ప్రత్యర్థులను ప్రశంసించడం కాదు.. సహచరుడికి మద్దతుగా నిలవండి’: కోహ్లీ మౌనం వీడాలంటోన్న ఫ్యాన్స్

Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..