Ind vs Pak: మీ ఆటగాళ్లను గౌరవించండి.. అవమానించొద్దు: షమీకి మద్దతుగా పాక్ ఓపెనర్ ట్వీట్
Trolls on Shami: షమీకి పాక్ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. పాకిస్తాన్ ఓసెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.
Mohammed Shami: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‌తో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తరువాత భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీని లక్ష్యంగా చూసుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కవయ్యాయి. గత రెండు రోజుల నుంచి దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం 3.5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్న షమీకి, ఈ మ్యాచులో అస్సలు కలిసిరాలేదు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు మెదపలేదు. షమీ తరపున మాట్లాడాలని కోహ్లిని అభిమానులు ట్విట్టర్‌లో కోరుతున్నారు. భారత ఆటగాళ్లు తమ సొంత సహచరుడి కోసం నిలబడలేకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు షమీకి పాక్ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. పాకిస్తాన్ ఓసెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. “ఒక ఆటగాడు తన దేశం, దేశంలోని ప్రజల కోసం ఓ కీలక మ్యాచులో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాడు. అలాగే ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో షమీ ఒకడు అని గుర్తుంచుకోవాలి. దయచేసి మీ ఆటగాళ్లను గౌరవించండి. ఈ గేమ్ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలి. అంతేకాని విభజించకూడదు” అంటూ రాసుకొచ్చాడు.
అలాగే షమీకి మద్దతుగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిలిచాడు. జీన్యూస్‌తో మాట్లాడుతూ.. “మొహమ్మద్ షమీ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. ఆదివారం అతని విషయంలో మంచిరోజు కాదు. ఇలాంటి రోజు ప్రతీ ఆటగాడికి ఉంటుంది. కానీ, అతని కులం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి బలవుతున్నాడు” అని తెలిపాడు.
అయితే ఇంతవరకు టీమిండియా ఆటగాళ్లు మాత్రం షమీ విషయంలో మాత్రం బహిరంగంగా మద్దతు పలకలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లను పొగిడే సమయం ఉందికానీ, సొంత జట్టు ఆటగాడి విషయంలో జరుగుతున్న ట్రోల్స్‌పై ఇంతవరకు మాట్లాడకపోవడమేంటని భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై అతని ఫ్యాన్స్ విరుచుకపడుతున్నారు. ఇప్పటికైనా మౌనం వీడాలని కోరుతున్నారు.
The kind of pressure, struggles & sacrifices a player has to go through for his country & his people is immeasurable. @MdShami11 is a star & indeed of the best bowlers in the world
Please respect your stars. This game should bring people together & not divide ’em #Shami #PAKvIND pic.twitter.com/3p70Ia8zxf
— Mohammad Rizwan (@iMRizwanPak) October 26, 2021
SA vs WI T20 World Cup 2021: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?