SA vs WI T20 World Cup 2021: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?
దుబాయ్‌లో జరిగే మ్యాచులో దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
SA vs WI T20 World Cup 2021: మంగళవారం టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 మ్యాచ్‌ల్లో భాగంగా డబుల్ హెడర్స్ జరగనున్నాయి. తొలి మ్యాచులో గ్రూప్-1లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడుతున్నాయి. దుబాయ్‌లో జరిగే మ్యాచులో దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండీస్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. వెస్టిండీస్‌ను ఇంగ్లండ్ ఓడించగా, దక్షిణాఫ్రికా టీంను ఆస్ట్రేలియా ఓడించింది. కాబట్టి, సెమీ-ఫైనల్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకు ఈ విజయం చాలా ముఖ్యం. అయితే 2020 నుంచి దుబాయ్ స్టేడియంలో జరిగిన మ్యాచులను ఓ సారి పరిశీలిస్తే ఈ మ్యాచులోనూ విజయం ఎవరివైపు ఉండనుందో ఇట్టే తెలిసిపోతోంది.
ఐపీఎల్ 2020 నుంచి దుబాయ్‌లో జరిగిన మ్యాచుల వివరాలు: మొత్తం మ్యాచులు- 5 మొదట బ్యాటింగ్ జట్లు గెలిచినవి- 0 సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచినవి-5 తొలి ఇన్నింగ్స్‌లో యావరేజ్ స్కోర్ -145(రాత్రి మ్యాచుల్లో మాత్రం170)
ఈ ఏడాది ప్రారంభంలో వెంస్టిండీ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20ఐ సిరీస్‌లో, డి కాక్ 255 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో సౌతాఫ్రికా నుంచి వేరెవరూ 180 పరుగులు కూడా చేరుకోలేకపోయారు. అయితే ఈ మ్యాచులోనూ మోకాలిపై కూర్చుని జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆటగాళ్లు నిరసన తెలపనున్నారు.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్(కీపర్), కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, రవి రాంపాల్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): టెంబా బావుమా(కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
Toss news from Dubai ?
South Africa will field first.
How many runs will West Indies score? ?#T20WorldCup | #SAvWI | https://t.co/Z1rjMJYjgL pic.twitter.com/lFkDA7Dfjo
— ICC (@ICC) October 26, 2021