Virat Kohli: ‘ప్రత్యర్థులను ప్రశంసించడం కాదు.. సహచరుడికి మద్దతుగా నిలవండి’: కోహ్లీ మౌనం వీడాలంటోన్న ఫ్యాన్స్

టీ20 ప్రపంచ కప్‌ 2021లో పాకిస్తాన్‌తో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పేసర్ మహ్మద్ షమీని ఆన్‌లైన్‌లో లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Virat Kohli: 'ప్రత్యర్థులను ప్రశంసించడం కాదు.. సహచరుడికి మద్దతుగా నిలవండి': కోహ్లీ మౌనం వీడాలంటోన్న ఫ్యాన్స్
Virat Kohli, Shami
Follow us

|

Updated on: Oct 26, 2021 | 3:40 PM

Mohammed Shami: టీ20 ప్రపంచ కప్‌ 2021లో పాకిస్తాన్‌తో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత పేసర్ మహ్మద్ షమీని ఆన్‌లైన్‌లో లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం 3.5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో షమీకి అస్సలు మంచిరోజు కాదు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ విషయంలో నోరు మెదపలేదు. షమీ తరపున మాట్లాడాలని కోహ్లిని అభిమానులు ట్విట్టర్‌లో కోరారు. భారతదేశం మోకరిల్లడంపై చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు మరియు ఆటగాళ్లు తమ సొంత సహచరుడి కోసం నిలబడలేకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

గతేడాది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు జాతిపరంగా దుర్భాషలాడినప్పుడు, కెప్టెన్ హ్యారీ కేన్‌తో సహా ఆటగాళ్లు తమ సహచరులకు మద్దతుగా నిలిచారు. అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం షమీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై ఇంతవరకు స్పందించలేదు. తన తోటి ఆటగాళ్లు కూడా ఇంతవరకు ఈ విషయంపై మాట్లాడకపోవడం విచారకరం.

షమీకి మద్దతుగా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిలిచాడు. జీన్యూస్‌తో మాట్లాడుతూ.. “మొహమ్మద్ షమీ విషయంలో ఏం జరుగుతుందో చూడండి. ఆదివారం అతని విషయంలో మంచిరోజు కాదు. ఇలాంటి రోజు ప్రతీ ఆటగాడికి ఉంటుంది. కానీ, అతని కులం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి బలవుతున్నాడు” అని తెలిపాడు.

అయితే బాబర్, రిజ్వాన్‌లను పొగుడుతూ, కోహ్లీ వారిపై ప్రసంశల వర్షం కురిపించాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. ప్రత్యర్థి ఆటగాళ్లను పొగిడే సమయం ఉందికానీ, సొంత జట్టు ఆటగాడి విషయంలో జరుగుతున్న ట్రోల్స్‌పై ఇంతవరకు మాట్లాడకపోవడమేంటని వాదిస్తున్నారు.

షమీ విషయంలో జరుగుతున్ననది సరైంది కాదు. ఈ మ్యాచులో దాదాపు అందరూ ఆటగాళ్లు విఫలమయ్యారు. కానీ, ఒక్క షమీనే లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై ఇప్పటి వరకు మౌనం వహించిన కోహ్లి.. ఇప్పటికైనా షమీకి జరుగుతున్న దానిపై మాట్లాడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చివరికి బీసీసీఐ కూడా ఎటువంటి మద్దతును ప్రకటించలేదు. ఈ విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

ఇలాంటి విషయాలను కంట్రోల్ చేయకుంటే భవిష్యత్తులో ఆటలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి షమీ విషయంలో ఎలాంటి వైకరిని ప్రదర్శిస్తారో చూడాలి.

Also Read: PAK vs NZ T20 World Cup 2021 Match Prediction: మరో విజయంపై కన్నేసిన పాక్.. కివీస్‌తో పోరాటానికి సిద్ధం.. గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయం

SA vs WI T20 World Cup 2021 Match Prediction: ఇరుజట్లకు విజయం చాలా కీలకం.. వెస్టిండీస్‌తో పోరుకు దక్షిణాఫ్రికా రెడీ..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు