Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs WI T20 World Cup 2021 Match Prediction: ఇరుజట్లకు విజయం చాలా కీలకం.. వెస్టిండీస్‌తో పోరుకు దక్షిణాఫ్రికా రెడీ..!

Today Match Prediction of SA vs WI: ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ టీంలు 15 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 9-6 వెస్టిండీస్ మ్యాచులో విజయం సాధించాయి.

SA vs WI T20 World Cup 2021 Match Prediction: ఇరుజట్లకు విజయం చాలా కీలకం.. వెస్టిండీస్‌తో పోరుకు దక్షిణాఫ్రికా రెడీ..!
T20 World Cup 2021, Sa Vs Wi
Follow us
Venkata Chari

|

Updated on: Oct 26, 2021 | 11:17 AM

SA vs WI T20 World Cup 2021 Match Prediction: మంగళవారం టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 మ్యాచ్‌ల్లో భాగంగా డబుల్ హెడర్స్ జరగనున్నాయి. తొలి మ్యాచులో గ్రూప్‌-1లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. దుబాయ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో ఓడిపోయాయి. వెస్టిండీస్‌ను ఇంగ్లండ్‌ ఓడించగా, దక్షిణాఫ్రికా టీంను ఆస్ట్రేలియా ఓడించింది. కాబట్టి, సెమీ-ఫైనల్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకు ఈ విజయం చాలా ముఖ్యం.

శనివారం ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 118/9 స్కోరును మాత్రమే చేయగలిగింది. దీంతో దక్షిణాఫ్రికా టీం వరుసగా సాధించిన ఏడు విజయాల ప్రయాణానికి బ్రేక్ పడింది. జులైలో వెస్టిండీస్‌పై చివరిసారిగా దక్షిణాఫ్రికా ఓడిపోయింది. సూపర్ 12 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఈ ఫార్మాట్ గత ప్రపంచ ఛాంపియన్ జట్టు చాలా బలంగా తిరిగిరావాలని ఎదురుచూస్తోంది.

ఎప్పుడు: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సూపర్ 12 గ్రూప్ 1, మధ్యాహ్నం 3:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

టీ20 హెడ్ టు హెడ్: దక్షిణాఫ్రికా 9-6 వెస్టిండీస్ (టీ20 ప్రపంచ కప్‌లో 2-1)

పిచ్ రిపోర్ట్: దుబాయ్‌లో జరిగిన గత మ్యాచులో వెస్టిండీస్ జట్టు 55 పరుగులకే ఆలౌటైంది. అయితే ఇక్కడ భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 300కి పైగా పరుగులు నమోదయ్యాయి. రెండు జట్ల బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడగలిగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. దాంతో ఈజీగా 150-160 పరుగులు చేయవచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు కురుస్తున్న కారణంగా ప్రయోజనం ఉండడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కచ్చితంగా చేయాల్సిందే.

వెస్టిండీస్: ఇంగ్లండ్‌పై దారుణంగా ఓడిపోయిన వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లలో క్రిస్ గేల్ మాత్రమే రెండంకెలకు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌పై పేలవమైన షాట్లను సెలక్ట చేసుకుని కరీబియన్ టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లలో ఆరుగురు ఔట్ అయ్యారు. ఈసారి జట్టు తన విధానాన్ని కచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లుగా ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను మార్చుకోవాలని చూస్తోంది.

దక్షిణాఫ్రికా: కేశవ్ మహారాజ్ పవర్ ప్లేలో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను దక్షిణాఫ్రికా టీ20 జట్టులో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. పవర్ ప్లేలో గొప్ప నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. అంతే కాకుండా మిడిల్ ఓవర్లలో కూడా వికెట్లు పడగొట్టే సత్తా ఉంది.

టీం న్యూస్: ఫామ్‌లో లేని మిల్లర్, క్లాసెన్.. దక్షిణాఫ్రికా బెంచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లేరు. దీంతో పేలవమైన ఫామ్ ఉన్నప్పటికీ, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్‌లను డ్రాప్ చేయడం కష్టం. రీజా హెండ్రిక్స్‌ను టాప్ ఆర్డర్‌లో చేర్చి, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐడెన్ మార్క్‌రామ్‌ను పంపే అవకాశం ఉంది.

టాప్ పిక్ – క్వింటన్ డి కాక్‌ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌ డి కాక్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. పవర్ ప్లేలో తన జట్టుకు ఘనమైన ప్రారంభాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇప్పటి వరకు ఆడిన 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 135.66 స్ట్రైక్ రేట్‌తో 1,765 పరుగులు చేశాడు.

టాప్ పిక్ – బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ – ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన బ్యాట్‌తో 30+ పరుగులు చేసిన ఏకైక ఆఫ్రికన్ ఆటగాడు మార్క్రామ్. 36 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులు చేశాడు. ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అలాగే, ఫీల్డర్‌గా కీలక పాత్ర పోషించగలడు.

ఎవిన్ లూయిస్ – వెస్టిండీస్ ఓపెనర్ లూయిస్ తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టడంలో పేరుగాంచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి తన ఖాతా తెరిచాడు.

టాప్ పిక్ – ఆల్-రౌండర్లు ఆండ్రీ రస్సెల్ – ఆండ్రీ రస్సెల్ టీ20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కు కీలకమని నిరూపించాడు. అతను ఇంగ్లండ్‌పై 0 పరుగులకే ఔటయ్యాడు. కానీ, ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించాలనే తపనతో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20లో అతని పేరిట 716 పరుగులు, 36 వికెట్లు ఉన్నాయి.

టాప్ పిక్ – బౌలర్లు ఎన్రిక్ నోర్త్యా – నోర్త్యా బంతితో దక్షిణాఫ్రికాకు గొప్ప ఆయుధంగా మారాడు. అతను తన అదనపు పేస్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 28.27 సగటుతో 11 వికెట్లు తీశాడు.

మీకు తెలుసా?

– టీ 20 ల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఏడవ దక్షిణాఫ్రికా క్రీడాకారుడు కావడానికి రీజా హెండ్రిక్స్‌కు ఇంకా ఏడు పరుగులు కావాలి.

– రోస్టన్ చేజ్ ఈ ఏడాది సీపీఎల్‌లో 144.33 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 6.92 బౌలింగ్ ఎకానమీ రేట్ కలిగి ఉన్నాడు.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, తబరైజ్ షమ్సీ

వెస్టిండీస్ ప్లేయింగ్ XI: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్

స్క్వాడ్‌లు: వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్(కీపర్), కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్, రవి రాంపాల్, ఒషానే థామస్, రోస్టన్ చేస్, రోస్టన్ చేస్, వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ, లుంగీ న్గిడి హెండ్రిక్స్, జార్న్ ఫోర్టిన్, వియాన్ ముల్డర్

Also Read: Mohammad Shami: వాళ్లు ద్వేషంతో ఉన్నారు.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్..

T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌.. పాకిస్తాన్‌కి మద్దుతు ఇవ్వాలా..! లేదంటే ఏం జరుగుతుంది..?