T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌కి మద్దుతు ఇవ్వాలా..! లేదంటే ఏం జరుగుతుంది..?
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కివీస్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది.
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కివీస్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్‌కు ఇది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్‌ని టీమిండియా ఆసక్తిగా తిలకించనుంది. అంతేకాదు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకో తెలుసుకోండి..
టీమ్ ఇండియా.. పాకిస్తాన్‌కి ఎందుకు మద్దుతు ఇస్తుందంటే ఈ మ్యాచ్ ఫలితంపై ఆధారపడే టోర్నిలో ఇండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. నిజానికి ఈ రోజు మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలవాలని భారత్ కోరుకోవాలి. ఇప్పటికే పాకిస్తాన్ తొలి మ్యాచ్‌లో ఇండియాపై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితిలో టోర్నమెంట్ ముందుకు సాగడంలో రన్ రేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను ఓడించాలని భారత్ భావిస్తోంది.
ఎందుకంటే ఈరోజు న్యూజిలాండ్ గెలిస్తే భారత్ రన్ రేట్ వ్యవహారంలో చిక్కుకోక తప్పదు. టోర్నిలో ముందు ముందు భారత్ సేఫ్‌గా ఉండాలన్నా, రన్ రేట్ విషయంలో చిక్కుకోకూడదన్నా ఈ రోజు పాకిస్తాన్ గెలవాలని కోరుకోవాలి. టీ20 పిచ్‌పై న్యూజిలాండ్, పాకిస్థాన్‌లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 14 గెలుపొందగా, న్యూజిలాండ్ 10 గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా, ఇందులో పాకిస్థాన్ 3 సార్లు, న్యూజిలాండ్ 2 సార్లు గెలిచాయి.