India Cricket Team: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు.. ధృవీకరించిన బీసీసీఐ వర్గాలు..!

India Cricket Team: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

India Cricket Team: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు.. ధృవీకరించిన బీసీసీఐ వర్గాలు..!
Rahul Dravid
Follow us

|

Updated on: Oct 26, 2021 | 5:54 PM

India Cricket Team: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) కోచ్‌గా ఉన్న ద్రావిడ్.. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో అందరి దృష్టి ద్రావిడ్ పైనే పడింది. అలాగే. ద్రవిడ్ నుంచి ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పోటీ పడుతున్నారని బీసీసీఐ‌ వర్గాలు తెలిపాయి. ‘ద్రావిడ్ టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్‌సీఏ హెడ్‌ రేస్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత కొంతకాలంగా రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్లు విపరీతంగా వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సీజన్‌ ఫైనల్ సమయంలో రాహుల్ ద్రావిడ్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.

‘‘జాతీయ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ద్రావిడ్ అంగీకరించారు. యువ క్రికెటర్లతో జట్టు బలంగా ఉంది. వారందరూ ద్రవిడ్‌తో కలిసి పని చేశారు కూడా. విదేశాల్లోని పిచ్‌లపై అవగాహన తెచ్చుకోవడానికి ద్రావిడ్ కోచింగ్ ఉపకరిస్తుంది. బీసీసీఐ ప్రాధాన్యతా వ్యక్తుల్లో ద్రావిడ్‌కు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానమే ఉంటుంది.’’ అని బీసీసీఐ ప్రతినిథి ఒకరు చెప్పుకొచ్చారు. అయితే, ద్రావిడ్ ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి, కార్యదర్శి జే షా మంత్రాంగం నడిపినట్లు తెలుస్తోంది. వారి ఒత్తిడి మేరకే ద్రావిడ్.. టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. పదవీ కాలం ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ లీగ్‌తో ముగియనుంది. టీ20 ప్రపంచప్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు.

Also read:

Viral Video: డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

Rare Case: వృద్ధురాలిని పొడిచిన ఆవు.. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Revolt Electric Bike: రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ బుకింగ్స్ ప్రారంభం.. మామూలు ప్లగ్‌తో బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు..(వీడియో)

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!