Rare Case: వృద్ధురాలిని పొడిచిన ఆవు.. యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన పోచమ్మను రెండురోజుల క్రితం ఓ ఆవు
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన పోచమ్మను రెండురోజుల క్రితం ఓ ఆవు పొడిచి తీవ్రంగా గాయపరచింది. స్థానిక సీసీటీవీ ఫుటేజీలో కూడా ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు నమోదయ్యాయి. దీనిపై బాధితురాలి కుమారుడు పోలీసులను ఆశ్రయించగా సదరు ఆవు యజమాని టీకాధర్ యాదవ్‌పై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం..పోచమ్మ, ఆమె కుమారుడు శాంతి నగర్‌లో నివాసముంటున్నారు. రెండ్రోజుల క్రితం పోచమ్మ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఆవు పొడిచేంది. కొమ్ములతో తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు ఆమెను 108 సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
గతంలోనూ .. అయితే పోచమ్మనే కాదు ఈ ఆవు గతంలోనూ పలువురిని పొడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం నాలుగేళ్ల బాలుడిని కూడా ఇలాగే గాయపర్చింది. ఇన్ని జరుగుతున్నా సదరు ఆవు యజమాని నిర్లక్ష్యం వహించాడని, దానిని కట్టడి చేయకుండా గాలికి వదిలేశాడన్న అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also read: Hyderabad: నల్లగండ్ల లాడ్జిలో యువతి మృతి కేసు మిస్టరీ.. అందుకే ఒంగోలు పారిపోయానంటోన్న కోటిరెడ్డి
Hyderabad: నల్లగండ్ల లాడ్జిలో యువతి మృతి కేసు మిస్టరీ.. అందుకే ఒంగోలు పారిపోయానంటోన్న కోటిరెడ్డి
Viral Video: ఓ యువతా ఇదేనా మీకు చదువు నేర్పిన సంస్కారం.. గుండె మండే వీడియో ఇది..