Hyderabad: నల్లగండ్ల లాడ్జిలో యువతి మృతి కేసు మిస్టరీ.. అందుకే ఒంగోలు పారిపోయానంటోన్న కోటిరెడ్డి
హైదరాబాద్ నల్లగుండ్లలోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో గాయాలతో ఒంగోలులో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Lady Death Mistery: హైదరాబాద్ నల్లగండ్లలోని ఓ లాడ్జిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో గాయాలతో ఒంగోలులో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటిరెడ్డి గాయాలకు చికిత్స చేసిన అనంతరం రిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోనందుకు లాడ్జిలో కత్తితో పొడుకుచుకుని తను, ప్రియురాలు నాగచైతన్య ఆత్మహత్యాయత్నం చేసినట్టు కోటిరెడ్డి చెబుతున్నాడు. నాగచైతన్య చనిపోవడంతో గాయాలతో ఒంగోలు పారిపోయి వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు నిన్నటి కథనే మళ్లీ కొత్తగా చెబుతున్నారు.
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న కోటిరెడ్డిని ఈరోజు చందానగర్ పోలీసులు విచారించారు. పోలీసులకు కూడా కోటి రెడ్డి తాను నాగచైతన్యను చంపలేదని చెబుతున్నాడు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి కోటిరెడ్డి పరిస్థితి బాగానే ఉందని తెలుసున్నారు చందానగర్ పోలీసులు… ఆస్పత్రి నుంచి కోటిరెడ్డిని విడుదల చేసిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.
తాను నాగచైతన్యను హత్య చేయలేదని, తమ ప్రేమ పెళ్ళికి తన ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్ళి జరిగే అవకాశం లేదని నాగచైతన్యకు చెప్పడంతో ఆమె మనస్థాపానికి గురై కత్తితొ పొడుచుకుందని చెబుతున్నాడు. అప్పటికే లాడ్జిలో మద్యం మత్తులో ఉన్న తనకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఆమె కత్తితో పొడుచుకోవడం తానుకూడా ఫ్రస్టేషన్‌కు గురై అదే కత్తితో పొడుచుకున్నానని, వెంటనే బయటి ఎంజీబీఎస్ నుంచి బస్‌లో ఒంగోలుకు పారిపోయానని చెబుతున్నాడు.
Read also: Maoist Bandh Call: ములుగు ఎన్‌కౌంటర్ బూటకం.. 27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు