Viral News: ఇంట్లో దాచిన రూ.47 లక్షలు తీసుకుని ఆటోడ్రైవర్‌తో పరారైన కోటీశ్వరుడి భార్య.. పోలీసులను ఆశ్రయించిన భర్త.

భర్తకు తెలియకుండా ఇంట్లో దాచిన రూ.47 లక్షలు తీసుకుని ఆటోడ్రైవర్‌తో పారిపోయింది ఓ మహిళ.

Viral News: ఇంట్లో దాచిన రూ.47 లక్షలు తీసుకుని ఆటోడ్రైవర్‌తో పరారైన కోటీశ్వరుడి భార్య.. పోలీసులను ఆశ్రయించిన భర్త.
Follow us
Basha Shek

|

Updated on: Oct 27, 2021 | 12:41 PM

భర్తకు తెలియకుండా ఇంట్లో దాచిన రూ.47 లక్షలు తీసుకుని ఆటోడ్రైవర్‌తో పారిపోయింది ఓ మహిళ. ఈ విషయం తెలుసుకున్న భర్త షాక్‌కు గురయ్యాడు. ఆతర్వాత తేరుకుని పోలీసులను ఆశ్రయించాడు. విస్తుగొలిపే ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా ఖజ్రానా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…పారిపోయిన ఆటోడ్రైవర్‌ నిందితురాలిని రోజూ తన ఆటోలోనే ఇంటి దగ్గర దింపేవాడు. అయితే ఈనెల 13 న రాత్రి నుంచి తన భార్య కనిపించడం లేదని, అదేవిధంగా ఇంట్లో అల్మారాలో దాచిన 47 లక్షలు కూడా మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన కంటే 13 ఏళ్ల చిన్నవాడితో… బాధితుడికి కోట్ల రూపాయల ఆస్తులతో పాటు విలువైన భూములున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రణాళిక ప్రకారమే నిందితురాలు ఆటోడ్రైవర్‌తో పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు పారిపోయిన ఆటోడ్రైవర్‌ పేరు ఇమ్రాన్‌ అని గుర్తించారు. అతను నిందితురాలు కంటే 13 ఏళ్లు చిన్నవాడని…రోజూ అతనే ఆమెను తన ఆటోలో ఇంటి దగ్గర దింపే వాడని వారు చెబుతున్నారు. అదేవిధంగా ఇమ్రాన్‌ స్నేహితులను కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి రూ.33లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రధాన నిందితులైన ఆటోడ్రైవర్‌, మహిళను పట్టుకోవడానికి పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. ఖాండ్వా, ఉజ్జయిని, జవ్రా, రత్లామ్‌ నగరాల్లో నిందితులు తలదాచుకున్నట్లు సమాచారం ఉందని, త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Also Read:Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

Crime News: మహిళా రేషన్ డీలర్ వీరంగం.. ప్రభుత్వ ఉద్యోగుల కళ్లల్లో కారం కొట్టిన రేషన్ డీలర్

Madhya Pradesh: చూస్తుండగానే కుప్పకూలిన యుద్ధవిమానం.. వీడియో